24 గంటల కర్ఫ్యూ.. సీఎం కేసీఆర్‌ సీరియస్‌

By అంజి  Published on  24 March 2020 2:18 PM GMT
24 గంటల కర్ఫ్యూ.. సీఎం కేసీఆర్‌ సీరియస్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు 36 నమోదు అయ్యాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ప్రస్తుతానికి ఒకరు కోలుకున్నారని, మరో 35 మంది చికిత్స పొందుతున్నారని అన్నారు. ఇప్పుడున్న కేసుల్లో ఎవరీకి కూడా సీరియస్‌గా లేదన్న ఆయన.. అందరూ కోలుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ బాధితులకు ఏప్రిల్‌ 7 వరకు తగ్గిపోతుందన్నారు. ఈలోపు కొత్త కరోనా కేసు రాకపోతే.. వైరస్‌ను తరిమికొట్టినవారం అవతామన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నామని కేసీఆర్‌ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 195 దేశాలకు కరోనా వైరస్‌ వ్యాపించిందన్నారు.

కరోనా పాజిటివ్‌ కేసుల పాస్‌పోర్టులు సీజ్‌ చేయాలని ఆదేశించామన్నారు. కరోనా వైరస్‌ పెద్ద మహమ్మారి.. మనందరం అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్‌ అన్నారు. అమెరికాలో ఆర్మీని దింపారు. మాట వినకుంటే షూట్‌ ఎట్‌ సైట్‌ ఆర్డర్‌ ఇస్తామన్నారు. ఆర్మీని దింపాల్సి వస్తదని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యనించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటామని చెప్పారు. కవి సమ్మేళనాలు నిర్వహించాలన్నారు.

ప్రజాప్రతినిధులకు దండం పెట్టి చెబుతున్నా..

కరోనా వైరస్‌ నియంత్రణలో ప్రజా ప్రతినిధులు ఎక్కడికి పోయారని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీలో 150 కార్పొరేటర్స్‌ ఏమయ్యారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణలో కేవలం పోలీసులు మాత్రమే కనిస్తున్నారని అన్నారు. ప్రజా క్షేత్రంలో ప్రజా ప్రతినిధులు పని చేయాలని చెప్పారు. జిల్లా కేంద్రాలకు వెళ్లి కరోనాపై అవగాహన కల్పించాలని మంత్రులకు సీఎం కేసీఆర్‌కు చూపించారు. ఇక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పని చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ స్టాండింగ్‌ కమిటీలు క్రియాశీలకంగా పని చేయాలన్నారు. ప్రజాప్రతినిధులకు దండం పెట్టి చెబుతున్నా అని అయన.. సర్పంచ్‌ నుంచి మంత్రుల వరకు కథానాయకులు కావాలన్నారు. పోలీసులతో పాటు ప్రజా ప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది..

తెలంగాణ సరిహద్దులు మూసివేశామని.. సరిహద్దుల దగ్గర వాహనాలు భారీగా ఉన్నాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఈ ఒక్కరోజు వారిని తెలంగాణలోకి అనుమతిస్తామని చెప్పారు. రేపటి నుంచి ఎలాంటి వాహనాలను అనుమతించమని పేర్కొన్నారు. వరి, మొక్కజొన్న పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. మార్కెట్‌ కమిటీలన్నీ బంద్‌.. రైతులు ఎవరూ రావొద్దన్నారు. కూరగాయల ధరలు అధికంగా పెంచితే పీడీయాక్ట్‌ కేసులు పెడతామని సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు.

నిత్యావసర ధరలు పెంచిన దుకాణాలన్నీ సీజ్‌ చేస్తామని సీఎం కేసీఆర్‌ హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అత్యవసర వస్తువుల షాపులు తెరుచుకోవచ్చన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత షాపులు మూసివేయాలని చెప్పారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని కేసీఆర్‌ అన్నారు. ఇక గ్రామాల్లో వ్యవసాయ పనులను అడ్డుకోమన్నారు. గుంపులు గుంపులు కాకుండా ఇరిగేషన్‌ పనులు చేసుకోవచ్చన్నారు.

మీడియాకు ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది: కేసీఆర్‌

వార్తలు సేకరించేందుకు మీడియాకు ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని కేసీఆర్‌ అన్నారు. మీడియా ప్రతినిధులను పోలీసులు అడ్డుకోవద్దని చెప్పారు.

Next Story