నేడు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ కీల‌క స‌మీక్ష‌లు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Nov 2020 3:52 AM GMT
నేడు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ కీల‌క స‌మీక్ష‌లు

కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం మధ్యాహ్నం 2గంటల నుండి ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహిస్తారు. 2020 - 2021 బడ్జెట్ పై మధ్యంతర సమీక్ష జరుపుతారు. కరోనా ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై, సవరించుకోవాల్సిన అంశాలపై కూలంకషంగా చర్చ జరుపుతారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థిక శాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొంటారు. శనివారం నాడు జరిగే సమీక్షలో వచ్చే అంచనాలపై ఆదివారం మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది.

అనంత‌రం యాదాద్రి దేవాలయ నిర్మాణ పనులపై సాయంత్రం 4గంటలకు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. వైటిడిఎ స్పెషల్ ఆఫిసర్, యాదాద్రి జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బి అధికారులు, దేవాలయ ఈవో తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారు. నిర్మాణ పనుల్లో పురోగతిని సీఎం సమీక్షిస్తారు.

Next Story