మంత్రులు, అధికారులతో కేసీఆర్ అత్యవసర భేటీ
By రాణి
దేశ వ్యాప్తంగా కరోనా కోరలు ప్రజలను కాటేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం కరోనా సోకకుండా ఉండేందుకు ఇప్పటికే పలు సూచనలు చేసింది. తాజాగా తెలంగాణలో 13 కరోనా కేసులుండటంతో సీఎం కేసీఆర్ అధికారులు, మంత్రులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. మంత్రి ఈటల రాజేందర్, కలెక్టర్లు, ఎస్పీలు, ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు.
Also Read : డబ్బుకోసం కాదు..ప్రపంచ శ్రేయస్సు కోసం..
కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని, అందరిని అప్రమత్తం చేయాల్సిందిగా కేసీఆర్ సూచించారు. ఉద్యోగస్తులకు జలుబు, దగ్గు, జ్వరం వంటివి ఉంటే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని తెలిపారు. అలాగే కరీంనగర్ లో 8 కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో జిల్లాలో అందరికీ..ముఖ్యంగా రామగుండం పరిసర ప్రాంతాల ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. వీలైతే కరోనా లక్షణాలున్నట్లు ఎవరికైనా అనుమానం ఉంటే 14రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఉద్యోగస్తులెవరైనా సిక్ లీవ్ అడిగితే వెంటనే ఇవ్వాలని కేసీఆర్ తెలిపారు.
Also Read : భారత్ లో 172 కరోనా కేసులు..