డబ్బుకోసం కాదు..ప్రపంచ శ్రేయస్సు కోసం..

By రాణి  Published on  19 March 2020 7:32 AM GMT
డబ్బుకోసం కాదు..ప్రపంచ శ్రేయస్సు కోసం..

ఎక్కడైనా సరే..పక్కవాడు ఎదుగుతున్నాడంటే చూసి ఓర్వలేవు చాలా మంది కళ్లు. ఆ కుళ్లుతోనే తమ అభివృద్ధిని మరిచిపోయి ఎదుటివారిపై ఏడుస్తుంటారు. అంతెందుకు మన ఇంట్లో వయసు పైబడి ఉన్నవారికి ఆరోగ్యం బాలేదంటే మీలో ఎంతమంది స్పందిస్తారు ? చాలామంది ఇళ్లలో పెద్దవారికి ఆరోగ్యం బాలేదంటే పట్టించుకోరు. ఆ..ఎప్పుడూ ఉండేదేగా అని తీసిపారేస్తారు. అలాంటిది ఇప్పుడు ప్రపంచానికి అంటుకున్న పెద్ద రోగాన్ని వదిలించేందుకు ఓ మహిళ ధైర్యం చేసింది. తాను లేకపోతే తన పిల్లలు, కుటుంబం ఏమైపోతుందన్న ఆలోచనను పక్కనపెట్టి కరోనా మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడటమే ధ్యేయంగా..ధైర్యంగా అడుగు ముందుకేసింది. కరోనా వైరస్ నివారణ కోసం వైద్యులు, శాస్ర్తవేత్తలు కలిసి కష్టపడి తయారు చేసిన టీకాను ప్రయోగించేందుకు తన శరీరాన్నే ప్రయోగశాలగా చేసుకుంది. ఇదేదో ఆమె పేదరికంతో డబ్బుకోసం చేస్తుందనుకుంటే మాత్రం అది పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఆమె ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఆపరేషనల్ మేనేజర్ గా పనిచేస్తోంది. తనకు వచ్చే జీతంతో చాలా లగ్జరీ లైఫ్ ను లీడ్ చేయొచ్చు. కానీ ఆమె అలా అనుకోలేదు. ఆ త్యాగమూర్తి మహిళే..జెన్నీఫర్ హాలెర్.

పాపం ఉద్యోగాలు లేకుండా ఎలా ?

జెన్నీఫర్ హాలెర్ (43) అమెరికాలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఒకరికి 16, మరొకరికి 13 ఏళ్ల వయసుంటుంది. నెలరోజుల నుంచి ప్రపంచాన్ని కుదిపేస్తోన్న కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమో మనందరికీ తెలుసు. అమెరికాలో కూడా వైరస్ తీవ్ర రూపం దాల్చడంతో చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశాయి. జెన్నీఫర్ కూడా ఇంటి నుంచే పనిచేస్తోంది. కాగా..చాలా కంపెనీలు తమ కంపెనీల్లో ఉద్యోగస్తులను తొలగించేరారు. వారిలోనే సాఫ్ట్ వేర్ టెస్టర్ అయిన జెన్నీఫర్ భర్త కూడా ఉన్నారు. దీంతో జెన్నీఫర్ ఆలోచనలో పడింది.

Also Read : గాలి, ప్లాస్టిక్ ద్వారా కూడా కరోనా..

తన భర్త లాగానే చాలామంది అమెరికా పౌరులు నిరుద్యోగులుగా మారారు. తమ ఇంట్లో అయితే పోషణ ఎలా గడుస్తుందన్న బెంగ లేదు కానీ..మిగతా వారు ఉద్యోగాలు లేకుండా తమ కుటుంబాలను ఎలా పోషించుకోగలుగుతారంటూ ఆలోచించింది. అప్పుడే కరోనా వ్యాక్సిన్ పై క్లినికల్ పరీక్షల కోసం 15-55 ఏళ్ల లోపు వారు కావాలన్న ప్రకటనను ఆమె చూసింది. వైరస్ కారణంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు తాను ఈ రకంగా సహాయపడాలనుకుంది. వెంటనే దరఖాస్తు చేసుకుంది. ఇందుకోసం చాలామంది దరఖాస్తులు చేసుకున్నప్పటికీ జెన్నీఫర్ తో పాటు మరో నెట్ వర్క్ ఇంజినీర్, ఎడిటోరియల్ కో ఆర్డినేటర్ ను మాత్రమే ఎంపిక చేశారు. ఈ ముగ్గురిలో మొదటగా వ్యాక్సిన్ తీసుకున్నది మాత్రం జెన్నిఫర్ హాలెరే..

Also Read : భారత్ లో 172 కరోనా కేసులు..

అమెరికాలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్), మోడెర్నా సంస్థలు mRNAn1273 అనే సాంకేతిక నామంతో ఈ టీకాను కనిపెట్టాయి. కాగా..ఈ నెల 16వ తేదీన జెన్నీఫర్ ఈ టీకాను తీసుకున్నారు. తర్వాత ఆమె శరీరంలో వచ్చే మార్పులను వైద్యులు గమనిస్తూ..వివిధ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. నెలరోజుల తర్వాత మరో డోస్ టీకాను వేస్తారు. ఇలా రెండు దశల్లో టీకా వేసి..దాని వల్ల ఎలాంటి దుష్ర్పభావాలు లేకపోతే కరోనా వైరస్ కు టీకా వచ్చేసినట్లే. కానీ..ఈ మందుకు లైసెన్స్ అప్రూవల్ రావాలంటే మాత్రం చాలా సమయం పట్టేలా ఉందంటున్నారు వైద్యులు. టీకా కనిపెట్టినా.. సంవత్సరంన్నర తర్వాతకు గానీ అందుబాటులోకి రాదని సమాచారం.

Also Read : ఇండియన్‌ రైల్వే సంచలన నిర్ణయం..

ఏదేమైనా కొత్తగా వచ్చిన టీకాను మొదటిసారి తన శరీరంపై ప్రయోగించుకోవడానికి చాలా ధైర్యం కావాలి. దానివల్ల వచ్చే దుష్ర్పభావాలు తెలియవు. శరీరంలో దానివల్ల వచ్చే మార్పులను తట్టుకోవాలి. అది సక్సెస్ అయితే ఓకే. సక్సెస్ అవ్వకపోతే దానివల్ల వచ్చే ఫలితాలను కూడా అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి మనమంతా జెన్నీఫర్ పై ప్రయోగించిన టీకా సక్సెస్ అయి..ఆమె పూర్తి ఆరోగ్యంతో తిరిగి తనకుటుంబాన్ని కలవాలని కోరుకుందాం.

Next Story