నెంబర్‌ ప్లేట్‌పై సీఎం జగన్‌.. ఆశ్చర్యపోయిన పోలీసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Oct 2019 5:07 AM GMT
నెంబర్‌ ప్లేట్‌పై సీఎం జగన్‌.. ఆశ్చర్యపోయిన పోలీసులు

మేడ్చల్‌: అభిమానం కాస్త పిచ్చిలా మారింది. కారు నెంబర్‌ ప్లేట్‌పై నెంబర్‌కు బదులు ఏపీ సీఎం జగన్‌ అని రాసుకొని యథేచ్చగా తిరుగుతున్న యువకుడికి పోలీసులు బ్రేక్‌వేశారు. జీడిమెట్ల ట్రాఫిక్‌ పోలీసులు వాహనా తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఈ కారు వారి కంటపడింది. వివరాల్లోకి వేళ్తే.. మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం జీడిమెట్ల పైప్‌లైన్‌ రోడ్డులో మంగవారం ట్రాఫిక్‌ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు చేశారు. అదే సమయంలో అటుగా వచ్చిన వర్నా కారును చూసి పోలీసు సిబ్బంది అవాక్కయ్యారు. కారు నెంబర్‌ ప్లేట్‌కు బదులు ఏపీ సీఎం జగన్‌ అని ఉండటంతో ఇదేంటని ప్రశ్నించారు. దీంతో చలాన్లు, టోల్‌గేట్‌ల వద్ద ఫీజు మినహాయింపు కోసం ఇలా చేసినట్లు యువకుడు ముప్పిడి హరి పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు యువకుడు ముప్పిడి హరి పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారును జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించి లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులకు అప్పగించారు. ముప్పిడి హరి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంగా పోలీసులు గుర్తించారు. AP10 BD 7299 నెంబర్‌కు బదులు AP CM JAGAN అని పేరు రాయించుకోగా.. ముప్పిడి హరిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Next Story
Share it