హైదరాబాద్: తెలంగాణ సీఎం కాన్వాయ్‌కి ట్రాఫిక్ పోలీసుల ఫైన్..
By సుభాష్ Published on 3 Jun 2020 1:16 PM IST
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌కి హైదరాబాద్ పోలీసులు చలాన్లు విధించారు. సామాన్య ప్రజలతో పాటు ముఖ్యమంత్రి వాహనాలకు కూడా నిబంధనలు వర్తిస్తాయని తెలంగాణ పోలీసులు రుజువు చేశారు. ఓవర్ స్పీడ్‌తో వెళ్లడంతో పోలీసులు ఈ జరిమానాను విధించారు.
హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు మూడు ఫైన్లు విధించారు. మరో ఫైన్‌ను కోదాడ పరిధిలో విధించారు. కోదాడ సమీపంలోని శ్రీరంగాపురంలో 2019 అక్టోబర్ 16న మొదటిది, మాదాపూర్ పరిధిలో 2020 ఏప్రిల్ 15న రెండోది, చోలిచౌకి పరిధిలో ఏప్రిల్ 29న మూడోది. ట్యాంక్ బండ్ పరిధిలో 2020 జూన్ 1న నాలుగోది విధించారు. ఈ నాలుగు చలాన్లు కూడా ఓవర్ స్పీడ్‌కు చెందినవే కావడం గమనార్హం.
అయితే తాజాగా జూన్ 1న పడిన ఫైన్‌తో మొత్తం రూ. 4,140 కాగా, ముఖ్యమంత్రి కాన్వాయ్‌కు ఫైన్ పడిన విషయం మీడియాలో బయటకు రావడంతో వెంటనే స్పందించిన సీఎంవో కార్యాలయం చలాన్లను చెల్లించేసింది. దీంతోఈ-చలానాలోకారుకు సంబంధించిన విషయాలు నో పెండింగ్ చలాన్లుగా చూపిస్తుంది.