సివిల్స్‌ ప్రిలిమ్స్‌ను వాయిదా వేయలేం

By సుభాష్  Published on  28 Sep 2020 7:28 AM GMT
సివిల్స్‌ ప్రిలిమ్స్‌ను వాయిదా వేయలేం

అక్టోబర్‌ 4న జరగాల్సిన సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్షను వాయిదా వేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు యూపీఎస్సీ తెలిపింది. కరోనా నేపథ్యంలో సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్షను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. కాగా, పరీక్షను వాయిదా వేయడం సాధ్యం కాదని యూపీఎస్సీ తరపున న్యాయవాది ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. అయితే పరీక్షను వాయిదా వేయకపోవాడనికి గల కారణాలను తెలియజేయాలని, దానికి సంబంధించి మంగళవారం అఫిడవిట్‌ దాఖలు ఏచయాలని జస్టిస్ ఖాన్విల్కర్‌ నేతృత్వంలోని ధర్మాసనం యూపీఎస్సీని ఆదేశించింది. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేసింది.

షెడ్యూల్‌ ప్రకారం యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష అక్టోబర్‌ 4న జరగాల్సి ఉంది. దేశంలో కోవిడ్‌ వ్యాప్తి పెరుగుతుండటం, వివిధ రాష్ట్రాల్లో వరదల నేపథ్యంలో పరీక్షను రెండు నుంచి మూడు నెలల పాటు వాయిదా వేయాలని 20 మంది అభ్యర్థులు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా, కరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశంలోలాక్‌డౌన్‌ కారణంగా మే 31న జరగాల్సిన ఈ పరీక్ష వాయిదా పడిన విషయం తెలిసిందే. అనంతరం జూన్‌ 6న పరీక్ష పరీక్ష తేదీని ఖరారు చేస్తూ అక్టోబర్‌ 4న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అలాగే పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు ఇప్పటికే విడుదలయ్యాయి.

Next Story