అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి
By సుభాష్ Published on 17 Aug 2020 10:50 AM GMT
అమెరికాలో కాల్పుల మోత మోగింది. సిన్సినాటీలో నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరో 18 మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఓవర్ ది రైన్ ఏరియాలో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, పది మంది గాయపడ్డారు. అలాగే వాల్‌నట్ హిల్స్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు గాయపడ్డారు. ఇలా వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో నలుగురు మృతి చెందారు.
ఇలా గంట వ్యవధిలోనే ఈ కాల్పులు చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే కాల్పులకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఇప్పటి వరకు కాల్పులు జరిపిన దుండగుల సమాచారం లభించలేదని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సిన్సినాటీ పోలీసు అధికారులు తె లిపారు. మరో వైపు టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో జరిగిన కాల్పుల్లో పలువురు పోలీసులు గాయపడినట్లు తెలిపారు.
Next Story