కల్యాణదుర్గంలో చాపర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
By అంజి Published on 17 Feb 2020 11:46 AM IST
అనంతపురం జిల్లాలో ఓ చాపర్ ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం ఎరడికెర, మామిడి గ్రామాల మధ్యలోని వ్యవసాయ పొలాల్లో ఈ చాపర్ ఫ్లైట్ దిగింది. చాపర్ అత్యవసరంగా ల్యాండ్ కావడానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు. జిందాల్ కంపెనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు బళ్లారి నుంచి మైసూరు వెళ్తుండగా.. ఎరడికెరలో ఎమర్జెన్సీ ల్యాండిగ్ అయ్యింది.
చాపర్‌ను చూసేందుకు స్థానిక యువత అక్కడికి చేరుకున్నారు. చాపర్ ఫ్లైట్‌లో సాంకేతిక సమస్య కారణంగానే ల్యాండింగ్ అయినట్లు సమాచారం. ఈ చాపర్ జిందాల్ సంస్థకు చెందినదిగా భావిస్తున్నారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగానే ఉన్నారు. చాపర్‌లో కూర్చోవడానికి రెండు సీట్లు మాత్రమే ఉన్నాయి.
Next Story