చిరు - కొరటాల మూవీ షూటింగ్ కి ముహుర్తం ఖరారు..
By Newsmeter.Network Published on 15 Dec 2019 11:54 AM IST
మెగాస్టార్ చిరంజీవి - బ్లాక్ బష్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం ఇటీవల సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. పూజా కార్యక్రమాలతో ఈ సినిమాని స్టార్ట్ చేసారు కానీ.. సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు అనేది అఫిషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. దీంతో చిరు అభిమానులు ఎప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారా..? అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
ఈ మూవీ షూటింగ్ కి స్టార్ట్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు. ఇంతకీ ఎప్పుడంటారా..? ఈ నెల 26 నుంచి రెగ్యులర్ షూటింగ్ ఆరంభించనున్నారు. ఇందులో చిరంజీవితో పాటు మిగిలిన ముఖ్య పాత్రధారులు పాల్గొంటారు. హైదరాబాద్ లోని కోకాపేటలో వేసిన టెంపుల్ సెట్ లో ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఆతర్వాత సెకండ్ షెడ్యూల్ ను రాజమండ్రిలో చేయనున్నారు.
ఇందులో చిరంజీవి డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి కానీ.. చిత్ర యూనిట్ మాత్రం ఈ విషయాన్ని కన్ ఫర్మ్ చేయలేదు. చిరంజీవి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటూనే.. ఎంటర్ టైనింగ్ గా కూడా ఉంటుందని తెలిసింది. ఎంటర్ టైన్మెంట్ పార్ట్ ను ప్రముఖ రచయిత శ్రీధర్ సీపాన రాసారని.. దీనికి థియేటర్ లో మంచి రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు. మరి.. సైరాతో ఆశించిన సక్సస్ సాధించలేకపోయిన మెగాస్టార్ ఈ సినిమాతో బ్లాక్ బష్టర్ సొంతం చేసుకుంటారని ఆశిద్దాం.