టిక్‌టాక్‌ వద్దు.. చింగారీ ముద్దు.. గంటకు లక్ష డౌన్‌లోడ్‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Jun 2020 6:02 PM IST
టిక్‌టాక్‌ వద్దు.. చింగారీ ముద్దు.. గంటకు లక్ష డౌన్‌లోడ్‌లు

టిక్‌టాక్‌తో సహా 59 చైనా మొబైల్‌ యాప్‌లను కేంద్రం నిషేదించిన విషయం తెలిసిందే. టిక్‌టాక్‌కు భారత్‌లో విశేష ఆదరణ ఉంది. దాదాపు 20 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. టిక్‌టాక్‌ను నిషేదించడంతో.. దీనికి ప్రత్నామ్నాయ యాప్‌ ఏమైనా ఉన్నాయా అని వెతుకుతున్నారట. అందుకు సమాధానమే చింగారి యాప్‌. భారతీయులు తయారు చేసిన చింగారీ యాప్‌ను ప్రస్తుతం డౌన్‌లోడ్ చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. చింగారీ యాప్‌ గంటకు దాదాపు లక్ష మంది డౌన్‌లోడ్‌లు చేసుకుంటున్నట్లు సదరు కంపెనీ తెలిపింది. అంతేకాకుండా గంటకు 20లక్షల మంది ఈ యాప్‌ను చూస్తున్నట్లు చెప్పింది. ఈ యాప్‌ను బెంగళూరుకు చెందిన బిస్వాత్మా, సిద్ధార్థ్‌లు రైపొందించారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, పంజాబీ, మలయాళం, తమిళం భాష‌ల్లో ఈయాప్ అందుబాటులో ఉంది.

షార్ట్ వీడియో స‌ర్వీస్‌తో అచ్చం టిక్‌టాక్ మాదిరే ఉన్న ఈ యాప్‌పై ప్ర‌స్తుతం భార‌తీయులు మ‌క్కువ చూపిస్తున్నారు. స్వ‌దేశీ ప‌రిఙ్ఞానంతో రూపొందింన 'చింగారి' యాప్‌ను ప్రోత్స‌హించాలంటూ ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. పారిశ్రామికవేత్త ఆనంద్ మ‌హింద్రా సైతం చింగారి యాప్‌ను డౌన్‌లోడ్ చేసి దాని ప్ర‌త్యేక ఫీచ‌ర్స్‌ను వివ‌రించారు. స్వ‌దేశీ ప‌రిఙ్ఞానంతో రూపుదిద్దుకున్న చింగారి యాప్ రూప‌క‌ర్త‌ల‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ ట్వీట్ చేశారు. మ‌రో విశేషం ఏంటంటే ఆనంద్ మ‌హింద్రా ఇప్ప‌టివ‌ర‌కు టిక్‌టాక్ యాప్‌ను మునుపెన్న‌డూ డౌన్‌లోడ్ చేసుకోలేదు. 59 చైనా యాప్‌లపై నిషేదం అనంతరం ప్రత్యామ్నాయ యాప్‌లపై వినియోగదారుల దృష్టి సారించారు.



Next Story