పాక్‌కు చైనా షాక్‌.. 'వాడిపాడేసిన అండ‌ర్ వేర్ల‌తో మాస్కులు'

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 April 2020 9:30 AM GMT
పాక్‌కు చైనా షాక్‌.. వాడిపాడేసిన అండ‌ర్ వేర్ల‌తో మాస్కులు

క‌రోనా వైర‌స్‌(కొవిడ్‌-19) ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి పుట్టినిల్లు అయిన చైనాలో వైర‌స్ ప్ర‌భావం త‌గ్గిపోయింది. కాగా.. మిగ‌తాదేశాల‌న్ని ఈ వైర‌స్ ధాటికి అత‌లాకుత‌లం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఇబ్బందులు ప‌డుతున్న మిత్ర‌దేశాల‌ను సాయం అందించేందుకు ముందుకు వ‌చ్చింది చైనా.

పాకిస్థాన్‌కు చైనా ఎలాంటి మిత్ర‌దేశ‌మో అంద‌రికి తెలిసిందే. మిత్ర‌మా మా వాళ్లు మీ వైర‌స్‌ను మా దేశానికి తెచ్చారు. మా ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డానికి క‌నీసం మాస్కులు కూడా లేవు .. క‌నీసం మా వైద్యుల కోసం ఎన్‌-95 మాస్కులు పంపించు అని పాక్ ప్ర‌భుత్వం చైనా ను కోరింది.

మిత్రుడు కోరడం.. చైనా పంప‌క‌పోవ‌డమా.. అంత‌కు మించి (ఎన్‌-95 మాస్కులకు మించి)న మాస్కుల‌ను పంపిచింది. చైనా నుంచి వ‌చ్చిన మాస్కుల‌ను విప్పి చూడ‌గా షాక్ తిన‌డం పాక్ వంతైంది. మాస్కులైతే ఉన్నాయి గానీ అవి.. వాడిపాడేసిన అండ‌ర్ వేర్ల‌తో త‌యారు చేసిన మాస్కులు.

ఈ ఘటనను పాకిస్థాన్‌లోని వివిధ న్యూస్ ఛానల్స్ ఎండగడుతున్నాయి. ఈ సందర్భంగా భారత ఆర్మీ మేజర్(రిటైర్డ్) గౌరవ్ ఆర్య ఇటీవల పాకిస్థాన్ టీవీ చానెల్‌లో ప్రసారమైన వీడియోను ట్వీట్ చేశారు.ఆ వీడియోలోని న్యూస్ యాంకర్.. మాస్కుల విషయంలో చైనా తమ దేశానికి సున్నం రాసిందని పేర్కొంది. లో దుస్తులకు ఉపయోగించే క్లాత్‌తో తయారు చేసిన మాస్కులను చైనా పంపిందని, వీటిని ధరించి కరోనా రోగులను ట్రీట్ చేయడం కుదరని పేర్కొంది. ఇలాంటి మాస్కులు పంపి చైనా తమను అవమానించడం తగతని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.

సింధ్‌ రాష్ట్ర అధికారులు వాటిని తనిఖీ చేయకుండానే కరాచీలోని హాస్పటల్‌కు తరలించినట్లు పాక్ మీడియా తెలిపింది. మొత్తంగా చైనా 2 లక్షల సాధారణ మాస్క్‌లు, 2 వేల ఎన్‌-95 మాస్క్‌లు, 5 వేలవెంటిలేటర్లు, 2 వేలు టెస్టింగ్‌ కిట్‌లు, 2 వేలు ప్రొటెకివ్‌ దుస్తులను పాక్‌కు పంపింది.

Next Story