దెబ్బకొట్టబోయి దెబ్బతిన్న చైనా

By అంజి  Published on  28 Jan 2020 2:48 AM GMT
దెబ్బకొట్టబోయి దెబ్బతిన్న చైనా

ముఖ్యాంశాలు

  • చైనా విషయంలో రుజువైన చెరపకురా చెడేవు సామెత
  • బయో ఆయుధాల నిర్మాణంపై పూర్తి స్థాయిలో చైనా దృష్టి
  • కెనడియన్ ల్యాబ్స్ నుంచి దొంగిలించబడిన కరోనా వైరస్
  • రహస్య షిప్ మెంట్ లో చైనాకు కరోనా వైరస్ రవాణా
  • అనుమానాస్పదంగా కనిపించిన పార్సిల్ తనిఖీ
  • అనుమానాస్పద పార్సిల్లో బయటపడ్డ కరోనా వైరస్
  • చైనాపై కన్నేసిన అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు

మీలో చాలామంది తమిళ హీరో సూర్య హీరోగా నటించిన సెవెన్త్ సెన్స్ సినిమా చూసే ఉంటారు. అందులో చైనా అనేక రకాలైన బయో వైరస్ లను సృష్టించి భారత దేశంపై దాడిచేసేందుకు ప్రయత్నించే దృశ్యాలు మీకు గుర్తుండే ఉంటాయి. అనేక రకాలైన కొత్త వైరస్ లు, రోగాలు భారత దేశానికి రాకుండా ఉండాలంటే తను అక్కడికెళ్లి వాటిని నిర్మూలించడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చిన బోధిధర్ముడు చైనాకి వెళ్లిన విషయమూ మనకు తెలిసిందే.

ఇవన్నీ కేవలం సినిమాకోసం సినిమాటిక్ గా చేసిన అభూత కల్పనలు కావు. ప్రేక్షకులను వెండి తెరకు కట్టిపడేసేందుకు అల్లిన కట్టుకథలు, మెలో డ్రామా అంతకంటే కాదు. నిజం. పూర్తిగా ఆ సినిమాలో చూపించినవన్నీ నిజం. ముమ్మాటికీ అవన్నీ నిజమే అని మన చరిత్ర చెబుతోంది. అసలు ప్రాచీన వైద్య విధానాలను, వివిధ రకాల ఆత్మ సంరక్షణ పోరాట పద్ధతులను చైనీయులకు నేర్పింది బోధిధర్ముడే అన్నదీ ముమ్మాటికీ సత్యమే.

ఆ మార్షల్ ఆర్ట్స్, ఆ సంప్రదాయ శాస్త్రీయ వైద్య విధానాలు పూర్తి స్థాయిలో భారత దేశానికి అందుతాయేమో అన్న భయంతో బోధిధర్ముడిని చైనీయులు హత్య చేసిన విషయమూ నిజమేనన్న విషయాన్ని మన చరిత్రకారులుకూడా ఒప్పుకున్నారు. ఇన్ని రకాల వైవిధ్యాలతో కూడిన సెవెన్త్ సెన్స్ సినిమా నవతరాలనికి తెలియని ఎన్నో చారిత్రక అంశాలను, సత్యాలను కళ్లకు కట్టింది.

చైనా ఇలా బయో వెపన్స్ ని తయారు చేసి భారత దేశంమీదికి వదిలేందుకు ప్రయత్నించిందన్నది చారిత్రక సత్యం. ఇప్పటికీ అలాంటి ప్రయత్నాలు ఆ దేశం చేస్తూనే ఉందన్నది ఇప్పుడు చైనాలో పుట్టిన కరోనా సంక్షోభం స్పష్టం చేస్తున్న అంశం. వూహాన్ ప్రాంతంలో జనంలోకి విపరీతంగా చొచ్చుకుపోయి మొత్తంగా చైనాని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ఆ దేశస్తుల స్వయంకృతాపరాధమే అన్న విషయం కూడా ఇప్పుడు ఆధారాలతోసహా బయటపడింది.

చెరపకురా చెడేవు అన్న సామెతను నిజం చేస్తూ బయో వెపన్స్ ద్వారా ఎవరినో నష్టపరిచేందుకు ప్రయత్నించిన చైనా ఇప్పుడు పూర్తిగా తను వేసుకున్న పథకంలో చిత్తైపోయి తనే పావుగా మారి పర్యవసానాలను పూర్తిగా అనుభవిస్తోంది. ఇది అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విశ్లేషకులు, అనేక దర్యాప్తు సంస్థలు ఆధారాలను పరిశీలించిన తర్వాత బల్లగుద్ది చెబుతున్న మాట.

కెనడియన్ ల్యాబ్స్ నుంచి దొంగిలించబడిన కరోనా వైరస్

కిందటి ఏడాది కెనడా నుంచి వచ్చిన అనుమానాస్పదమైన స్మగుల్డ్ షిప్ మెంట్ ప్రపంచం మొత్తాన్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే అందులో ఉన్నది ఏ విలువైన వస్తువో, వజ్రాలో, వైఢూర్యాలో లేక ఆఖరికి డ్రగ్సో కాదు. ఆ పార్సిల్ షిప్ మెంట్ లో ఉన్నది ప్రపంచాన్ని వణికించే సత్తా కలిగిన, ప్రస్తుతం చైనాను చేష్టలుడిగేలా చేసిన కరోనా వైరస్.

కెనడియన్ ల్యాబ్ లో పనిచేస్తున్న చైనా ఏజెంట్లు ఆ కరోనా వైరస్ ని చైనాకు పంపించారని విచారణలో తేలింది. ఈ ప్రాణాంతకమైన వైరస్ ని ఉపయోగించి తయారు చేసిన బయో వెపన్స్ సాయంతో భారత దేశాన్ని పూర్తి స్థాయిలో నాశనం చేయాలని చూస్తున్న చైనా కుయుక్తులు ఆధారాలతో సహా ఇప్పుడు బయటపడుతున్నాయి. భారత్ ని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో కరోనా వైరస్ తో ఆటలాడిన చైనా ఆ వైరస్ వల్ల ఇప్పుడు పూర్తిగా కుదేలయ్యిందన్నది ఎవరూ తోసి పుచ్చలేని వాస్తవం. వూహాన్ ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఈ సత్యాన్ని బలంగా కళ్లకు కడుతున్నాయి.

జూన్ 13, 2012లో ఓ అరవై ఏళ్ల సౌదీ పౌరుడు జెడ్డాన్ లోని ఓ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఏడు రోజులుగా ఎడ తెరిపి లేకుండా జ్వరం, దగ్గు, తుమ్ములు, జలుబు, తలనొప్పి, ఊపిరి ఆడకపోవడం లాంటి లక్షణాలు వరసగా ఏడు రోజులపాటు ఆతన్ని పీడించాయి. అతనికి శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులు, గుండెకు సంబంధించిన వ్యాధులు, పొగతాగే అలవాటు అంతకు ముందు ఉన్న దాఖలాలు ఏం లేదు. కానీ ఆ వ్యక్తి హాస్పిటల్లో చేరిన సమయంలో ఈ లక్షణాలతో గిలగిల్లాడాడు.

అప్పుడు ఆ సౌదీ పౌరుడికి ఉన్న లక్షణాలనుబట్టి అతని ఊపిరితిత్తుల్లో ఉన్న కరోనా వైరస్ ని ఈజిప్షియెన్ వైరాలజిస్ట్ డాక్టర్ అలీ మొహమ్మద్ జకీ గుర్తించాడు. రోగికి అన్ని రకాలైన పరీక్షలు, అన్ని రకాలైన వైద్యాలు చేసి చూసిన జకీ అంతుచిక్కని ఈ వ్యాధికి సంబంధించిన వివరాలను కనుగొనేందుకు రోటర్ డ్యామ్ లో ఉన్న ఎరాస్మస్ మెడికల్ సెంటర్ లో పనిచేస్తున్న లీడింగ్ వైరాలజిస్ట్ రాన్ పౌచర్ ని సంప్రదించాడు.

జకీ పంపిన శాంపిల్ ని పరీక్షించిన ఫౌచర్ అందులో కరోనా వైరస్ ఉందని నిర్థారించాడు. అత్యాధునిక పరీక్షా పద్ధతుల్ని ఉపయోగించి ఫౌచర్ ఈ విషయాన్ని కనుగొని, నిర్థారించాడు. ఫౌచర్ ఆ వివాదాస్పదమైన శాంపిల్ ని విన్నిపెగ్ లోని కెనడా జాతీయ మైక్రో బయాలజీ లేబొరేటరీ లో పనిచేస్తున్న సైంటిఫిక్ డాక్టర్ ఫ్రాంక్ ప్లమ్మర్ కి పంపించాడు.

సరిగ్గా ఇక్కడే కీలకమైన మలుపు తిరిగింది కథ. ఈ ల్యాబ్ లో పనిచేస్తున్న చైనా ఏజెంట్లు కరోనా వైరస్ శాంపిల్ ని దొంగిలించి దాన్ని రహస్యంగా చైనాకు పంపించారు. తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన షిప్ మెంట్ పార్సిల్ ని క్షుణ్ణంగా తనిఖీచేసి పరిశీలిస్తే అది కరోనా వైరస్ అన్న విషయం బయటపడింది.

దొడ్డిదారిలో లబ్ధి పొందాలని చూస్తోన్న చైనా

చైనాకు ప్రాంణాంతకమైన వైరస్ ని సేకరించాల్సిన అవసరం ఏమొచ్చింది. ఆదినుంచీ కుట్రలు, కుయుక్తులకు పెట్టింది పేరైన అమానుషమైన చర్యలకు పేరుపొందిన చైనా దేశస్తులు, నేతలు బయో ఆయుధాలను తయారుచేసి భారత్ తో పాటుగా వివిధ దేశాలపై ప్రయోగించి ప్రపంచవ్యాప్తంగా అరాచకాన్ని సృష్టించాలని చేసిన కుట్ర ప్రపంచానికి వెల్లడయ్యింది.

ఇనిస్టిట్యూట్ ఆప్ మిలట్రీ వెటర్నరీ, అకాడమీ ఆఫ్ మిలట్రీ మెడికల్ సైన్సెస్ - ఛుంగ్ చున్, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ – చెంగ్ డూ మిలట్రీ రీజియన్, వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆప్ వైరాలజీ, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ – హుబీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయాలజీ, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ – బీజింగ్ డాక్టర్ జియాంగుయో కియూతో కలిసి ప్రపంచాన్ని వణికించిన ఎబోలా వైరస్ ని ఖండాంతరాలు దాటించడంలో పూర్తి స్థాయిలో సహాయం చేసినట్టు అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలకు అందిన సమాచారం.

కేవలం ఎబోలాతో మాత్రమే సరిపెట్టుకోకుండా ప్రపంచాన్ని వణికించగల, తమ గుప్పెట్లో పెట్టుకోగల సామర్థ్యం కలిగిన అనేక రకాలైన వైరస్ లను సేకరించి, సృష్టించి వాటి సాయంతో బయో ఆయుధాలను తయారుచేసి దొడ్డిదారిలో లబ్ధి పొందాలని చైనా ప్రభుత్వం చూస్తోందన్నది అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలకు అందిన పక్కా సమాచారం.

Next Story