మీ జన్ ధన్ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదా తెలియట్లేదా ? ఇలా చెక్ చేసుకోండి
By రాణి Published on 14 April 2020 6:50 PM ISTకరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ తో భారత్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. ముఖ్యంగా ఉపాధి లేక కూలీలు, నిర్మాణ రంగ కార్మికులు, రోజూ కూలీ చేస్తే గానీ పూటగడవని పేదలు ఆకలి కేకలు పెడుతున్నారు. వారిని ఆదుకునేందుకు కేంద్రం పీఎం గరీబ్ కల్యాణ్ యోజన పేరిట పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రైతులు, తెల్లరేషన్ కార్డు దారులకు నిత్యావసరాలతో పాటు రూ.1000 ఆర్థిక సహాయం ప్రకటించింది. అలాగే జన్ ధన్ ఖాతాదారుల ఖాతాల్లో మూడు నెలలపాటు నెలకు రూ.500 జమ చేస్తున్నట్లు తెలిపింది. జన్ ధన్ ఖాతాదారులైన 20.4 కోట్ల మహిళలకు రూ.500 జమ చేసింది. కానీ ఖాతాదారులు తమకెలాంటి మెసేజ్ రాలేదని డబ్బులు పడలేదని కంగారు పడుతున్నారు. ఆగండి..కంగారు పడకండి. మీ అకౌంట్ లో కేంద్రం అందించిన రూ.500 పడ్డాయో లేదో అకౌంట్ బ్యాలెన్స్ చూస్తే తెలుస్తుంది కదా. ఇలా చేసి మీ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోండి.
Also Read : అదిరింది కమెడియన్ కు ఆది పవర్ ఫుల్ పంచ్
మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో జన్ ధన్ అకౌంట్ ఉంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి 18004253800 లేదా 180011211 నెంబర్ కు లేదా 9223766666 కాల్ చేస్తే మీ అకౌంట్ ఆఖరి 5 ట్రాన్సాక్షన్లు, అకౌంట్ బ్యాలెన్ వివరాలు వస్తాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో జన్ ధన్ అకౌంట్ ఉంటే 18001802223 లేదా 01202303090 నెంబర్లకు మిస్ కాల్ ఇస్తే ఎస్ఎంఎస్ వస్తుంది. అలా చేయడం కుదరకపోతే BAL అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ 16 అంకెల అకౌంట్ నంబర్ ను టైప్ చేసి 5607040కు ఎస్ఎంఎస్ చేస్తే మీ బ్యాలెన్స్ వివరాలు తిరిగి ఎస్ఎంఎస్ వస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే 09015135135 నెంబర్ కు మిస్ కాల్ ఇస్తే మీ అకౌంట్ బ్యాలెన్స్ వివరాలతో కూడిన ఎస్ఎంఎస్ వస్తుంది.
Also Read :రైళ్ల సర్వీసులు పునరుద్ధణపై భారతీయ రైల్వే కీలక ప్రకటన..