అదిరింది కమెడియన్ కు ఆది పవర్ ఫుల్ పంచ్

By రాణి  Published on  14 April 2020 11:44 AM GMT
అదిరింది కమెడియన్ కు ఆది పవర్ ఫుల్ పంచ్

హైపర్ ఆది..పంచ్ లకు కేరాఫ్ అడ్రస్ ఈ పేరు. స్టేజ్ ఎక్కి టీమ్ తో స్కిట్ మొదలెడితే చూసినవారెవ్వరికైనా ఆది పంచ్ లకు పొట్టచెక్కలవ్వాల్సిందే. బుల్లితెర జబర్దస్త్ షో లో ఆదికి ఉన్న క్రేజే వేరు. సుధీర్, అభి టీమ్ లలో పార్టిసిపెంట్ గా కెరీర్ మొదలుపెట్టిన ఆది ఇప్పుడు టీమ్ లీడర్ గా తనకంటూ ఓ పేరు సంపాదించుకున్నాడు. అయితే జబర్దస్త్ షో కు పోటీగా మొదలైన అదిరిందిలో ఒక పారిసిపెంట్ గా చేస్తున్న సద్దాం..ఓ ఎపిసోడ్ లో ఆది కన్నా తన స్కిట్ కే ఎక్కువ రేటింగ్ వచ్చిందని అన్నాడట. అది తెలిసిన ఆది ఏమైనా ఊరుకుంటాడా చెప్పండి. తన స్టైల్ లో పంచ్ ఇచ్చాడు.

Also Read : రైళ్ల సర్వీసులు పునరుద్ధణపై భారతీయ రైల్వే కీలక ప్రకటన..

ఐదేళ్లుగా నేను ఒక టీమ్ తో ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఇప్పటి వరకూ చేసిన స్కిట్లలో 100 కి పైగా స్కిట్లకు 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి. యూ ట్యూబ్ లో 5 కు పైగా స్కిట్లకు 60 మిలియన్, 30 మిలియన్ , 20 మిలియన్ వ్యూస్ వచ్చిన సంగతిని చెప్పుకొచ్చారు. 5 వారాల ఎపిసోడ్స్ తో ఒకరి టాలెంట్ ను అంచనా వేయలేమన్నారు. హైపర్ ఆదిని క్రాస్ చేయాలంటే..హైపర్ ఆది స్కిట్ల కంటే వారి స్కిట్లకు ఎక్కువ రేటింగ్ తెచ్చుకోవాలన్నారు. అంతెందుకు..ఏడేళ్లుగా జబర్దస్త్ లో ఉన్న సుధీర్ టీమ్ ను దాటి చూపించమనండి చాలు..అని ఆది పంచ్ వేశాడు. ఎవరూ భ్రమల్లో బతకొద్దు..ఎవరి టాలెంట్ వారిది..ఇలా పోల్చుకోవడం అంతమంచిది కాదన్నాడు హైపర్ ఆది.

Also Read :త‌న‌కంటే 30 ఏళ్ల చిన్నోడితో.. స్టార్ పుట్‌బాల‌ర్ త‌ల్లి డేటింగ్

కాగా..ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా అన్ని రకాల షూటింగ్ లు నిలిచిపోయాయి. దీంతో ఇటు జబర్దస్త్, అటు అదిరింది షో ల పాత ఎపిసోడ్ లనే ప్రసారం చేస్తున్నాయి టీవీ ఛానెల్స్. ఇప్పుడు మే 3వ తేదీ వరకూ లాక్ డౌన్ గడువు పెంచడంతో అప్పటి వరకూ ఎటువంటి షూటింగ్ లు జరిగేలా కనిపించడం లేదు. ఒక్క కామెడీ షో లే కాదు. సీరియళ్లది కూడా ఇదే పరిస్థితి.

Next Story
Share it