బాబాయ్ ప‌వ‌న్ తో చ‌ర‌ణ్ మూవీ ప్లాన్ చేస్తున్నాడా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Oct 2019 1:45 PM GMT
బాబాయ్ ప‌వ‌న్ తో చ‌ర‌ణ్ మూవీ ప్లాన్ చేస్తున్నాడా..?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్... సినిమాల‌కు గుడ్ బై చెప్పి పాలిటిక్స్ లో ఎంట్రీ ఇవ్వ‌డం... పాలిటిక్స్ లో స‌క్సస్ కాక‌పోవ‌డం తెలిసిందే. దీంతో ప‌వ‌న్ మ‌ళ్లీ సినిమాల్లో న‌టించాల‌నుకుంటున్నాడు. రీ ఎంట్రీ క‌న్ ఫ‌ర్మ్ అయితే... ఏ సినిమా చేయ‌నున్నాడు..? డైరెక్ట‌ర్ ఎవ‌రు..? అనేది ఆస‌క్తిగా మారింది. ఈ మేరకు హరీష్ శంకర్, బోయపాటి, క్రిష్ దర్శకత్వంలో సినిమాలు చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ప‌వ‌న్ రీ ఎంట్రీని బండ్ల గ‌ణేష్ ప్లాన్ చేస్తున్నార‌ని... అత‌ని బ్యాన‌ర్ లోనే ప‌వ‌న్ సినిమా ఉంటుంద‌ని టాక్ వినిపించింది కానీ.. బండ్ల గ‌ణేష్ తో సినిమా చేసేందుకు ప‌వ‌న్ ఇంట్ర‌స్ట్ చూపించ‌లేద‌ని తెలిసింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీలో నిర్మించాలని రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. చ‌ర‌ణ్ ప‌వ‌న్ ని అడ‌గ‌డం... ప‌వ‌న్ ఓకే చెప్ప‌డం జ‌రిగింద‌ట‌. ఈ సినిమా విష‌య‌మై క‌థా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయని తెలిసింది.

ప‌వ‌న్ తో చ‌ర‌ణ్ సినిమా తీస్తే... రికార్డులు సృష్టించ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా స్టార్ట్ కానుంద‌ని టాక్ వినిపిస్తోంది. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త నిజ‌మో కాదో తెలియాల్సివుంది.

Next Story
Share it