శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు రెండు రోజుల పర్యటన
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Oct 2019 6:27 AM GMT
విశాఖ: మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పైస్ జెట్ విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు విశాఖ వచ్చారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా రోడ్డు మార్గాన శ్రీకాకుళం ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు బయల్దేరి వెళ్లారు. రేపు శ్రీకాకుళం జిల్లాలోని నియోజకవర్గాల వారీగా టీడీపీ నాయకులు, కార్తకర్తలతో చంద్రబాబు సమావేశాలు జరుపుతారని పార్టీ వర్గాల సమాచారం. సమీక్ష అనంతరం చంద్రబాబు రేపు రాత్రి విశాఖ చేరుకొని హైదరాబాద్‌కు తిరుగు పయనం కానున్నారు.
Next Story