వైరస్‌ మాత్రమే కాదు.. వైర్‌లెస్ నెట్‌వ‌ర్క్ కూడా ప్ర‌మాద‌క‌ర‌మే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Jun 2020 12:39 PM GMT
వైరస్‌ మాత్రమే కాదు..  వైర్‌లెస్ నెట్‌వ‌ర్క్ కూడా ప్ర‌మాద‌క‌ర‌మే

తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు విశాల్. ఆయన నటించిన అన్ని సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల అవుతుంటాయి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం 'చక్ర'. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ నాలుగు ద‌క్షిణాది భాష‌ల్లో ఒకేసారి ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో 'జెర్సీ' ఫేమ్‌ శ్రద్దాశ్రీనాథ్‌ కథానాయిక. రెజీనా కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ ను విడుదల చేశారు. బ్యాంక్ రాబ‌రీ, హ్యాకింగ్‌, సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో అత్యుత్త‌మ సాంకేతిక విలువ‌ల‌తో సరికొత్త క‌థ-క‌థనాల‌తో ఈ చిత్రం రూపొందుతోంద‌ని ట్రైల‌ర్‌ చూస్తే తెలుస్తోంది.

వైరస్‌ మాత్రమే కాదు.. వైర్‌లెస్ నెట్‌వ‌ర్క్ కూడా ప్ర‌మాద‌క‌ర‌మే

ఆగ‌స్ట్ 15 ఇండిపెండెన్స్‌డే హైద‌రాబాద్‌ సిటీ మొత్తం హై అల‌ర్ట్‌లో ఉంటుంది కానీ ఆరోజు.. అని విశాల్ వాయిస్ ఓవ‌ర్‌తో మొద‌లైన 2నిమిషాల 10 సెకండ్ల నిడివిగ‌ల‌ ట్రైల‌ర్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగింది. మిల‌ట‌రీ ఆఫిస‌ర్‌గా విశాల్ ప‌వ‌ర్‌ఫుల్‌ ఎంట్రీ స్టైలిష్‌గా ఉంది. ఒక దేశాన్ని బెదిరించే తీవ్ర‌వాదుల యాక్టివిటీస్‌ని గ‌మ‌నించ‌డానికి ఒక నేష‌న‌ల్ సెక్యూరిటీ ఏజెన్సీ చేసే రీస‌ర్చ్ కంటే, ఓ స‌గ‌టు మ‌నిషి అవ‌స‌రాలు, వాడి ఆశ‌లు తెలుసుకోవ‌డం కోసం ఓ కార్పోరేట్ కంపెనీ చేసే రీస‌ర్చే ఎక్కువ అంటారు, క‌చ్చితంగా మ‌నం వెతికే క్రిమిన‌ల్ మ‌న కంటికి క‌నిపించ‌డు, ఇప్పుడే క‌దా వేడెక్కింది ది గేమ్ బిగిన్స్, కంటికి క‌నిపించ‌ని వైర‌స్ మాత్ర‌మే కాదు వైర్‌లెస్ నెట్‌వ‌ర్క్ కూడా ప్ర‌మాద‌క‌ర‌మే.. వెల్‌క‌మ్ టు డిజిట‌ల్ ఇండియా అంటూ ఆగంతకుడు చెప్పిన డైలాగ్‌తో ట్రైలర్‌ ముగిసింది. యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.

Next Story