రోహిత్ శర్మ అమ్మాయిగా పుడితే.. ఫోటో వైరల్
By తోట వంశీ కుమార్ Published on 19 Jun 2020 6:41 PM ISTకరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో క్రీడలు రద్దు అయ్యాయి. దీంతో ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. తమకు దొరికిన ఈ విరామాన్ని భారత క్రికెటర్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా గడుపుతున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. గ్రౌండ్‌లోకి దిగితే ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తాడో అందరికి తెలిసిందే. రోహిత్ కు లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. మరి అలాంటి రోహిత్ శర్మ అమ్మాయిగా పుట్టిఉంటే ఎంత అందంగా ఉండేవాడో ఎవరైనా ఊహించగలరా..? దీనికి భారత స్టార్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ రూపమిచ్చాడు. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటాడు చాహల్. ఎంతలా అంటే పక్క క్రికెటర్లకు విసురు వచ్చేంతగా.. ఓ సందర్భంలో చాహల్ నీ మొఖం నాకు జీవితంలో చూపించకు నీ ఎకౌంట్ ను బ్లాక్ చేస్తున్నానంటూ గేల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ స్పిన్నర్ సోషల్ మీడియాలో టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ యొక్క ఫోటోను షేర్ చేసారు. అయితే హిట్ మ్యాన్ ను ట్రోల్ చేయడానికి చాహల్ ట్విట్టర్ లో రోహిత్ పక్కన అతను ఉమెన్ వెర్షన్ లో ఉన్న ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దానికి "సో క్యూట్ యు లుకింగ్ రోహితా శర్మా భైయా'' అని కామెంట్ పెట్టాడు. ఇక రోహిత్ కూడా దీనిని సరదాగా తీసుకున్నాడు. కరోనా కారణం మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.