ఏపీ పర్యటనలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. ఎందుకంటే.!
By Medi Samrat Published on 8 Nov 2019 1:19 PM ISTముఖ్యాంశాలు
- గవర్నర్ ను కలిసిన కేంద్రమంత్రి
- కేంద్రమంత్రికి స్వాగతం పలికిన ఏపీ బీజేపీ నేతలు
కృష్ణా : కేంద్ర ఇంధన వనరులు, రసాయన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ కు చేరుకున్నారు. గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ ను మర్యాద పూర్వకంగా కలిసారు ధర్మేంద్ర ప్రధాన్. అంతకుముందు ఢిల్లీ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ ముఖ్య నేతలు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా గేట్‌వే హోటల్ కు చేరుకున్నారు. అక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కాగా.. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెంలో గ్యాస్ నిక్షేపాలు వెలికితీసే ప్రాంతంలో ఫిల్లింగ్‌స్టేషన్‌ను కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేడు ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఓఎన్జీసీ ప్లాంట్ వద్ద గ్యాస్ గేదరింగ్ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. మంత్రి పర్యటించే ప్రాంతాలను మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలి పరిశీలించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి భేటీ అయ్యారు. వచ్చే ఐదేళ్లలో పెట్రోలియం రంగానికి సంబంధించి ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నట్లు చెప్పారు. దీని వలన యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు ధర్మేంద్ర ప్రధాన్.