ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ మినహా అన్ని సేవలను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. అయితే వాటి నిర్వహణ బాధ్యతలను కేంద్రప్రభుత్వం.. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు అప్పజెప్పింది. ఈ విషయాన్ని ప్రకటించిన కేంద్ర హోంశాఖ.. పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.

కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం..

*కేంద్ర పార మిలటరీ బలగాలు, ఇంధన, గ్యాస్‌, విద్యుత్‌, తపాల, ట్రెజరీ, సమాచార వ్యవస్థ, ముందస్తు హెచ్చరికల కేంద్రాలు, విపత్తు నిర్వహణ మినహా అన్ని వ్యవస్థలను మూసివేయాలి. కేంద్ర ప్రభుత్వ, స్వతంత్ర వ్యవస్థల్లో సేవలను పూర్తిగా నిలిపివేయాలి.

*ఇక రాష్ట్రాల్లో పోలీస్‌, హోంగార్డ్స్‌, పౌరరక్షణ, ఫైర్ సెఫ్టీ, జైళ్లు, డిస్ట్రిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ట్రెజరీ, విద్యుత్‌, తాగునీరు, పారిశుద్ధ్యం మినహా అన్ని సేవలు నిలిపివేయాలి.

*ఆహార పదార్థాలు, పండ్లు, కురగాయలు, పాలు, మాంసం దుకాణాలను వీటి నుంచి మినహాయింపు వర్తించనుందని కేంద్ర హోంశాఖ తెలిపింది. అలాగే ఆస్పత్రులు.. వాటి అనుబంధ వ్యవస్థలు యాధావిధిగా పనిచేయనున్నాయి.

*ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా, టెలీ కమ్యూనికేషన్‌, ఇంటర్నెట్‌, బ్యాంక్‌లు, ఏటీఎంలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.

* ఈ-కామర్స్‌, శీతల కేంద్రాలు, నిత్యావసరాల తయారీ యూనిట్లు, గిడ్డంగులు, పెట్రోల్‌ పంపులకు మినహాయింపు కల్పించారు.

Also Read: అర్థం చేసుకోండి.. యుద్ధం సమయంలో కూడా రైలు ఆగలేదు

పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టును పూర్తిగా నిలిపివేయాలని.. అలాగే సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, సాంస్కృతిక సేవలను కూడా రద్దు చేయాలని పేర్కొంది.

ఈ నిబంధనలన్నీ అమలయ్యేలా చూసే బాధత్య ప్రతి జిల్లా న్యాయాధికారికి అప్పగించారు. అర్థరాత్రి 12 గంటల నుంచి నిబంధనలు అమలులోకి వచ్చాయి.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.