ఇంకా రెండేళ్ల గడువు పెంపు: స్థానికతపై కేంద్ర నిర్ణయం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Oct 2019 5:33 AM GMT
ఇంకా రెండేళ్ల గడువు పెంపు: స్థానికతపై కేంద్ర నిర్ణయం

అమరావతి : హైదరాబాద్‌లో వివిధ రకాల కులాలు, మతాల వారే..కాకుండా ఇతర రాష్ట్రల ప్రజలు కూడా ఇక్కడ జీవనం సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వారి స్థానికతను పొడిగిస్తూ మరోసారి కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే వివిధ స్థాయిల్లో ఫిర్యాదులతో పాటు..విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశంలో స్థానికత ప్రస్తావన రావటంతో కేంద్రం గడువు పొడిగిస్తూ చర్చలు జరిపింది. ఈ మేరకు 2019 జూన్‌ నుంచి 2021 జూన్‌ వరకూ..ఇంకా రెండేళ్లు గడువు పొడగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

అయితే గతంలోదీనిపై రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను సవరిస్తూ కేంద్రం ఈ ప్రకటన విడుదలచేసింది. రాష్ట్ర విభజన అనంతరం మొదట 3 ఏళ్ల పాటు స్థానికత నిబంధనపై సడలింపు ఇచ్చారు. 2017లో మరో రెండేళ్లు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వివిధ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, విద్యాసంస్థలో ప్రవేశాలకు ఈ ఉత్తర్వులను వర్తింపజేస్తూ.. కేంద్రం మరోసారి ఈ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Next Story