కేంద్ర కేబినెట్‌ సంచలన నిర్ణయం..

By Newsmeter.Network  Published on  24 Dec 2019 11:03 AM GMT
కేంద్ర కేబినెట్‌ సంచలన నిర్ణయం..

ఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా కేంద్రమంత్రి వర్గం సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 16వ సారి జన గణనకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు జనాభా లెక్కలు చేపట్టనున్నారు. యాప్‌ సాయంతో జనాభా లెక్కలు కొనసాగనున్నాయి. అయితే జనాభా లెక్కల కొరకు ప్రజలు ఎలాంటి పత్రాలు చూపించాల్సిన అవసరం లేదు కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ పేర్కొన్నారు. ఎన్‌పీఆర్‌ నోటిఫికేషన్‌, బయోమెట్రిక్‌, డేటా బేస్‌ వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించింది. జాతీయ జనాభా రిజిస్టర్‌ను అప్‌గ్రేడ్‌ చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీని కోసం రూ.8,500 కోట్లను కేంద్రం కేటాయించింది.

జనాభా వివరాల్లో ప్రతి పౌరుడి డేటాబేస్‌ను తయారు చేయడమే తమ లక్ష్యమని సెన్సస్‌ కమిషన్‌ ఇది వరకే తెలిపింది. పౌరులు ఒక ప్రాంతంలో ఆరు నెలల కన్నా ఎక్కువ సమయం ఉన్నవారే జాతీయ జనాభా రిజిస్టర్‌కు అర్హులు. ఎన్‌పీఆర్‌లో పౌరుడి భౌగోళిక, బయోమెట్రిక్‌ వివరాలను ఉంచనున్నారు. దీని ప్రకారం ప్రతి ఒక్క పౌరుడూ తన వివరాలను ఎన్‌పీఆర్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. ఎన్‌పీఆర్‌కు సెన్సస్‌ అనుసంధానమై ఉంటుంది. దీని ద్వారానే జాతీయ జనాభా పట్టికను తయారు చేస్తారు. ఒక్క అస్సాం మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జనాభాను లెక్కించనున్నారు. అటల్‌ జల్‌ యోజన పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. జనాభా లెక్కల రిజిస్టర్‌లో వివరాల నమోదుకు రూ.9,941 కోట్లను కేంద్ర కేటాయించింది. అలాగే అటల్‌ జల్‌ యోజన పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ పథకానికి రూ.6000 కోట్లు కేటాయించింది. అటల్‌ టన్నెల్‌ పథకానికి కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Next Story