మీకు తెలుసా.. మన సెల్‌ఫోన్.. టాయిలెట్ సీటు కంటే డేంజర్ అని..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 Feb 2020 1:59 PM GMTమనకు సెల్‌ఫోన్ లేకపోతే నడవదు. రోజు గడవదు. మనమంతా సెల్ ఫోన్ వాడుతాం. మాములుగా కాదు ఇష్టం వచ్చినట్టు.. ఎక్కడపడితే అక్కడ.. ఎలా పడితే అలా వాడుతాం. ఉదయం నిద్రలేవగానే పాయఖాన మొదలు.. రాత్రి పడుకునే వరకూ ప్రతి చోట చరవాణే మన నేస్తం.
అయితే అందరూ అనుకున్నట్టుగా సెల్‌ఫోన్ వాడకం అంత క్షేమదాయకం కాదు. మన ఫోన్లలో కంటికి కనబడని చాలా మురికి దాగుందని పరిశోధనలు చెబుతున్నాయి. అవి ఎక్కువ సూక్ష్మక్రిములను సేకరిస్తే, మీరు ఎక్కువ సూక్ష్మక్రిములను తాకుతారని శాస్త్రవేత్తలు అంటున్నారు. వాస్తవానికి మన ఫోన్‌ను అపరిశుభ్రమైన పరిసరాలలోకి మనతో పాటు తీసుకువెళ్లడమే మనం చేసే పెద్ద తప్పు. డెలాయిట్ చేసిన ఒక సర్వే ప్రకారం.. అమెరికన్లు రోజుకు 47 సార్లు తమ ఫోన్‌లను శుభ్రపరుచుకుంటారు.
ఇక సూక్ష్మజీవులు మన వేళ్ల నుండి ఫోన్‌కు వెళ్లడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మనం ఏదైనా చేయటానికి ముందు.. సాధారణంగా చేతులు కడుక్కోవడానికి కూడా మనం సెల్ ఫోన్‌లను తీసుకువెళతాం. అక్కడ కూడా మన ఫోన్‌కు ఎన్నో క్రిములు జత అవుతాయని మిచిగాన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విశ్వవిద్యాలయ ఎపిడెమియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎమిలీ మార్టిన్ అంటున్నారు.
ఇక సెల్ ఫోన్‌లలో ఎన్ని సూక్ష్మక్రిములు సంచరిస్తున్నాయనే దానిపై చాలా పరిశోధనలు జరిగాయి. ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో హైస్కూల్ విద్యార్థుల ఫోన్లలో 17,000 కంటే ఎక్కువ బ్యాక్టీరియా క్రిములు కనుగొనబడ్డాయని తేలింది. ఇదే విషయమై అరిజోనా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు.. మనం వాడే సెల్‌ఫోన్లలో.. టాయిలెట్ సీట్ల కంటే 10 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియాను కలిగి ఉన్నాయనే విషయాన్ని తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు.
సహజంగానే మానవ చర్మం సూక్ష్మజీవులతో కప్పబడి ఉంటుంది. ఇవి సాధారణంగా ఎటువంటి ఆనారోగ్యం కలిగించే పరిణామాలను కలిగి ఉండవు. కానీ మనం చేతులతో నూనెలు వాడినప్పుడు, ఏదైనా చదివిన ప్రతిసారీ మన ఫోన్‌కు ఎన్నో రకాల బ్యాక్టిరియా చేరుతుంది. అయితే.. ఫోన్‌లపై ఉండే చాలా బ్యాక్టిరియా కణాలు మనల్ని అనారోగ్యానికి గురిచేసే వ్యాధికారక పదార్థాలు కావని మార్టిన్ తెలిపారు. కానీ కొన్ని రకాల బ్యాక్టీరియా వల్ల మాత్రం నష్టం ఉంటుందని కొలంబియా యూనివర్శిటీ మెడికల్ సెంటర్ క్లినికల్ మైక్రోబయాలజీ డైరెక్టర్ సుసాన్ విట్టీర్ అంటున్నారు.