కోవిడ్-19 వ్యాప్తి చెందడం.. జాగ్రత్తలపై సీడీసీ సూచనలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Aug 2020 8:14 AM ISTకోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. తాజాగా అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) కోవిడ్ వ్యాప్తి గురించిన కీలక అంశాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వెల్లడించింది. మనిషి నుంచి మనిషికి మాత్రమే వైరస్ అత్యంత సులభంగా వ్యాపిస్తుందని, వస్తువులు ఇతర ఉపరితలాల ద్వారా కోవిడ్ వ్యాప్తి జరిగే అవకాశం తక్కువని తెలిపింది. ఇలాంటి సూపర్ స్ర్పెడ్‌లను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సూచించింది. .
కోవిడ్-19 వైరస్ వ్యాప్తిపై సీడీసీ జరిపిన పరిశోధనలో శాస్త్రీయ ఆధారాలు:
1. ఉపరితలాల ద్వారా కోవిడ్ వ్యాప్తి(Surface Transmission) చెందే ప్రమాదం చాలా తక్కువ -- Very Low risk
2. బహిరంగ కార్యకలాపాల(Outdoor activities) ద్వారా కూడా కోవిడ్ వ్యాప్తి చాలా తక్కువ -- Very Low risk
3. ఆఫీసులు, మతపరమైన ప్రదేశాలు, సినిమా హాళ్ళు, జిమ్‌లు లేదా థియేటర్లు వంటి జనసమూహాలుండే ప్రదేశాల ద్వారా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది -- Very High risk
పైన చెప్పినవన్నీ వైరస్ వ్యాప్తి జరగకుండా ప్రజలు తాము అనుసరించే ఉత్తమ మార్గాలను బట్టి అంచనా వేయడం జరిగింది. ఉపరితలాల ద్వారా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందన్న భయాన్ని తగ్గించడంతోపాటు ఆఫీసులకు వెళ్లాలన్న అమితాసక్తిని కూడా తగ్గించుకోవాలి. వీలైనంతవరకు ఇంటినుంచే పనిచేసేందుకు ప్రయత్నించాలి.
ప్రశ్న:- కోవిడ్-19 వైరస్ ఒకరి నుంచి మరొకరికి ఎలా వ్యాప్తించవచ్చు?
ప్రశ్న:- కోవిడ్-19 వైరస్ ప్రభావానికి ఎలా గురవుతారు ?
కోవిడ్-19 పేషెంట్ నుంచి ఓ వ్యక్తిలోకి కరోనా చేరాలంటే ఆ వైరస్‌కు దాదాపు 1000 వైరల్ కణాలు (వైరల్ పార్టికల్స్ - వీపీ) చేరాలి.
- శ్వాస ద్వారా నిమిషానికి 20వీపీ
- మాట్లాడినపుడు 200 వీపీ
- దగ్గినపుడు 200 మిలియన్ వీపీ (వెంటిలేషన్ తక్కువగా ఉన్న చోట గాలిలో ఇవి కొన్ని గంటల పాటు బతికే ఉంటాయి)
- తుమ్మినపుడు 200 మిలియన్ వీపీ. ఇలా వీపీలను పరిగణలోకి తీసుకుంటే వైరస్ వ్యాప్తిని అంచనా వేయొచ్చు.
ఫార్ములా
సక్సెస్‌ఫుల్ ఇన్‌ఫెక్షన్ = (వైరస్ బారిన పడగలిగే తీరు x సమయం)
ఉదాహరణకు కొన్ని:
1. కరోనా ఉన్న వ్యక్తికి ఆరడుగుల దూరంలో 45 నిమిషాల కంటే తక్కువ సమయం ఉంటే మనకు కరోనా సోకే అవకాశం తక్కువే ఉంటుంది.
2. వ్యక్తికి దగ్గరగా ముఖంలో ముఖం పెట్టి (మాస్కు ధరించినప్పటికీ) అంటే అత్యంత సమీపం నుంచి అతడితో 4 నిమిషాలు లేదా అంతకన్నా ఎక్కువ సేపు మాట్లాడితే వైరస్ మనలో ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
3. ఆ వ్యక్తులు మన పక్కనుంచి నడుచుకుంటూ లేదా సైక్లింగ్ చేసుకుంటూ వెళ్లినట్లయితే వైరస్ అంటుకునే ప్రమాదం తక్కువగానే ఉంటుంది.
4. వెలుతురు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో నిర్ణీత సమయం పాటు వైరస్ మనదరి చేరే అవకాశం ఉండదు.
5. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కిరాణా, కూరగాయల షాపులకు వెళ్లినపుడు కరోనా బారిన పడే రిస్క్ మధ్యస్థంగా ఉంటుంది.
6. ఇండోర్ ప్లేసుల్లో ఎక్కువ సేపు గుమిగూడి ఉండటం అత్యంత ప్రమాదకరం.
7. పబ్లిక్ బాత్‌రూంలు, సామూహిక ప్రదేశాలు ఎక్కువగా వైరస్ వ్యాప్తి చేస్తాయి.
8. రెస్టారెంట్ల లోపల కూర్చోవడం వల్ల వైరస్ తొందరగా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. (అయితే ఉపరితలాలను తాకడంలో జాగ్రత్తలు వహించడం ద్వారా వైరస్ వ్యాప్తిని కొంత అరికట్టవచ్చు).
9. ఆఫీసులు, పాఠశాలల్లో భౌతిక దూరం పాటించినప్పటికీ వైరస్ సోకే ప్రమాదం అత్యంత ఎక్కువగా ఉంటుంది.
10. పార్టీలు, పెళ్లిళ్లలాంటి కార్యక్రమాల ద్వారా వైరస్ అత్యంత త్వరగా వ్యాప్తి చెందుతుంది.
11. బిజినెస్ నెట్వర్కింగ్/ కాన్ఫరెన్సులు కూడా వైరస్ ను ఎక్కువగా వ్యాప్తి చేస్తాయి.
12. సినిమా హాళ్లు, కన్సర్ట్‌లు, ప్రార్థనా స్థలాలు ద్వారా అధిక స్థాయిలో కేసులు నమోదయ్యే అవకాశం ఎక్కువుగా ఉంది.
ప్రమాదకర అంశాలు
మనం తిరిగే ప్రాంతాలను బట్టి మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో తెలుసుకోవచ్చు.
- ఇండోర్స్ vs ఔట్ డోర్స్
- చీకటి లేదా ఇరుకుగా ఉన్న ప్రదేశాలు vs వెలుతురుగా ఉండే పెద్ద ప్రదేశాలు
- జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలు vs జనసాంద్రత తక్కువగా ఉండే ప్రాంతాలు
- ఎక్కువ సమయం బహిర్గతం కావడం vs తక్కువ సమయం బహిర్గతం కావడం
ఇండోర్స్, చీకటి లేదా ఇరుకుగా ఉన్న ప్రదేశాలు, జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ఇలాంటి వాటివల్లే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని గమనించగలరు.