వైసీపీ ఎంపీ ఇంట్లో సీబీఐ సోదాలు
By సుభాష్ Published on 8 Oct 2020 3:46 PM ISTతెలుగు రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. తాజాగా వైసీపీ నేత, నర్సాపురం ఎంపీ రాఘురామకృష్ణం రాజు ఇంట్లో సీబీఐ తనిఖీలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందాలు.. ఎంపీ నివాసంలో గురువారం ఉదయం నుంచి సోదాలు జరుపుతున్నారు. ఇందు, భారత్ కంపెనీ సహా 8 కంపెనీలకు చెందిన డైరెక్టర్ల ఇళ్లల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
అయితే గతంలో సీబీఐ నమోదు చేసిన కేసుల ఆధారంగానే ప్రస్తుతం తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సోదాలు రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. ఢిల్లీలోని రఘురామ కృష్ణం రాజు గెస్ట్‌హౌస్‌తో పాటు హైదరాబాద్‌లోని గచ్చిబౌతిలోని నివాసం, ఏపీలోని నరసాపురంలో ఉన్న నివాసంలో కూడా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో పలు కీలక పత్రాలను పరిశీలించి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
Also Read
ఏసీబీ ముందు నోరు విప్పని అవినీతి ఏసీపీ
Next Story