యజమానిపై కోపంతో కారును దగ్ధం చేసిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేస్తుకుంది. కింగ్ కోఠి లోని ఒక ఫంక్షన్ కు వెళ్లిన కారు యజమాని మాజ్ తన కారును రోడ్డు పక్కన పార్క్ చేసి లోపలకు వెళ్ళాడు. ఇదే అదునుగా భావించిన కారు డ్రైవర్ హుస్సేన్.. తనతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు తో కలిసి కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి మంటలను ఆర్పారు. వాహనం పూర్తిగా కాలిపోయినదని పోలీసులు తెలిపారు.  కారును తగలబెట్టిన హుస్సేన్ తో సహా ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగేళ్ల క్రితం కూడా హుస్సేన్ పై కారుదగ్థం చేసిన కేసు ఉందని  పోలీసులు తెలిపారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.