సూర్యాపేట జిల్లా: ప్రమాదవశాత్తూ సాగర్ ఎడమ కాలువలోకి ఏపీ 31 బీపీ-338 నెంబర్ గల కారు దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆరుగురు ఉన్నట్లు తెలుస్తోంది. కారులో ఉన్న ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు సికింద్రాబాద్ కు చెందిన అబ్దుల్ (45), రాజేష్ (29), జాన్సన్ (33), సంతోష్ కుమార్ (23), పవన్ కుమార్‌ (23)లగా గుర్తించారు. చాకిరాలలో స్నేహితుని వివాహానికి హాజరై తిరుగు ప్రయాణంలో వస్తుండగా ప్రమాదం జరిగింది. కోదాడ నియోజకవర్గ పరిధిలోని నడిగూడెం మండలం చాకిరాల సమీపంలో ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్, పోలీసులు చేరుకున్నారు. రాత్రి సమయం కావడం, సాగర్ కాలువలో నీరు ఉధృతంగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.