కరీంనగర్‌లో ఘోర ప్రమాదం.. మానేరు బ్రిడ్జిపై కారు బోల్తా

By సుభాష్  Published on  16 Feb 2020 5:13 AM GMT
కరీంనగర్‌లో ఘోర ప్రమాదం.. మానేరు బ్రిడ్జిపై కారు బోల్తా

కరీంనగర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అలుగునూరు మానేరు బ్రిడ్జిపై ఓ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే విధి నిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్‌ బ్రిడ్జిపై నుంచి దిగేందుకు ప్రయత్నించగా, జారీ కిందపడిపోయాడు. దీంతో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి బోల్తా పడ్డ కారును పైకి లేపేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా, తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Next Story
Share it