ఘోర బస్సు ప్రమాదం.. 9 మంది మృతి

By సుభాష్  Published on  16 Feb 2020 3:38 AM GMT
ఘోర బస్సు ప్రమాదం.. 9 మంది మృతి

కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు పెద్ద బండరాయిని ఢీకొనడంతో 9 మంది మృతి చెందారు. మైసూర్‌ నుంచి మంగళూరుకు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు ఉడుపి సమీపంలోని చిక్కమగళూరు ఘాట్‌ రోడ్డు సమీపంలో నిన్న సాయంత్రం అదుపు తప్పి బండరాయిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, మరో 31 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్య్కూ టీం ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

బస్సు అతి వేగంగా వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరంతా మైసూర్‌కు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగులుగా గుర్తించారు.. విహారయాత్ర నిమిత్తం వీరంతా మైసూర్‌ నుంచి బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు తెలిపారు. మృతులు రాధా, రవి, యోగేంద్ర, ప్రితం గౌడ, బసవరాజు, అనఘ్న, షారుల్‌, రంజిత, మారుతిలుగా గుర్తించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story
Share it