హైదరాబాద్‌ నగర శివార్లలో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. రూ.2.62 కోట్ల విలు చేసే 1,050 కిలోల గంజాయిని విశాఖ నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా హైదరాబాద్‌ శివార్లలో పట్టుకున్నట్లు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. నగరంలో తనిఖీలు నిర్వహిస్తుండగా, ఒక కంటైనర్‌లో ఇతర సరుకుల రవాణాలో ప్లాస్టిక్‌ సంచుల్లో గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద వాహనాన్ని సీజ్‌ చేసి గంజాయిని స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.