హైదరాబాద్‌లో 1,050 కిలోల గంజాయి పట్టివేత
By సుభాష్Published on : 16 Aug 2020 7:30 AM IST

హైదరాబాద్ నగర శివార్లలో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. రూ.2.62 కోట్ల విలు చేసే 1,050 కిలోల గంజాయిని విశాఖ నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా హైదరాబాద్ శివార్లలో పట్టుకున్నట్లు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. నగరంలో తనిఖీలు నిర్వహిస్తుండగా, ఒక కంటైనర్‌లో ఇతర సరుకుల రవాణాలో ప్లాస్టిక్ సంచుల్లో గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఎన్‌డీపీఎస్ చట్టం కింద వాహనాన్ని సీజ్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Next Story