కేఫ్ కాఫీ డే.. 4000 కోట్లు ఏమయ్యాయి..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 July 2020 4:49 PM IST
కేఫ్ కాఫీ డే.. 4000 కోట్లు ఏమయ్యాయి..?

ఏసియాలోనే అతిపెద్ద కాఫీ ఎస్టేట్ అయిన కేఫ్ కాఫీ డే ఫౌండర్ విజి సిద్దార్థ కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం క్రిష్ణ అల్లుడు.. ఆయన నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన భారత్ లోని వ్యాపారవర్గాల్లో తెలియని బాధను తీసుకొని వచ్చింది.

ఆయన మరణంపై కాఫీ డే ఎంటర్ప్రైజెస్(సిడిఈఎల్) విచారణకు ఆదేశించింది. విజి సిద్ధార్థ స్థాపించిన మైసూర్ అమల్గమేటెడ్ కాఫీ ఎస్టేట్స్(ఎం.ఏ.సి.ఈ.ఎల్.) కంపెనీకి మధ్య కొన్ని ఆర్థిక లావాదేవీలు జరిగాయని తెలిసింది. 3500-4000 కోట్ల రూపాయలకు లావీదేవీలకు సంబంధించిన రికార్డులు అందుబాటులో లేవని చెబుతున్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మాజీ డిఐజి అశోక్ కుమార్ మల్హోత్రా, అవస్థ లీగల్స్ కు చెందిన ఎం.ఆర్.వెంకటేష్ విచారణ చేస్తున్నారు. దీనిపై సిద్ధార్థ కుటుంబ సభ్యులెవరూ స్పందించలేదు. దాదాపు రూ.4000 కోట్ల అవకతవకల గురించే ప్రస్తుతం సిడిఈఎల్ సంస్థ దృష్టి పెట్టింది.

కాఫీ డే వ్యవస్థాపకులు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్న సమయానికి కంపెనీ అప్పులు రూ.4,970 కోట్లుగా ఉన్నాయి. వీజీ సిద్ధార్థ మృతి అనంతరం కాఫీ డే గ్లోబల్ నాన్-కోర్ అసెట్స్ అమ్మకం ద్వారా రుణాలను క్రమంగా తీరుస్తోంది. టెక్నాలజీ బిజినెస్ పార్క్ విక్రయంపై బ్లాక్ స్టోన్ గ్రూప్‌తో డీల్ కుదిరిన అనంతరం 13 రుణసంస్థలకు రూ.1644 కోట్ల రుణాలను చెల్లించింది.

కేఫ్ కాఫీ డే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం‌లో పలు ఔట్ లెట్స్ మూసి వేసింది. లాభదాయక అంశాలు, ఖర్చులు పెరగడం వంటి అంశాలను కారాణాలుగా చూపుతూ 280 ఔట్ లెట్స్‌ను మూసివేసింది. గత ఏడాది ఏప్రిల్-నవంబర్(2019) మధ్య కూడా దాదాపు 500 ఔట్ లెట్లను మూసి వేసింది. జూన్ 30, 2020 నాటికి కేఫ్ కాఫీ డే ఔట్ లెట్స్ సంఖ్య 1,480కి తగ్గాయి.

Next Story