మే 3 వ‌ర‌కు లాక్‌డౌన్ కొన‌సాగించాలా..? వ‌ద్దా..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 April 2020 8:14 AM GMT
మే 3 వ‌ర‌కు లాక్‌డౌన్ కొన‌సాగించాలా..? వ‌ద్దా..?

క‌రోనా వ్యాప్తిని నిరోధించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం మే 3 వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగించిండంతో పాటు ఈ నెల 20 నుంచి కొన్ని మిన‌హాయింపులు కూడా ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మే 3 వ‌ర‌కు లాక్‌డౌన్ కొన‌సాగించాలా..? లేక కేంద్రం ఆలోచ‌న ప్ర‌కారం ఏప్రిల్ 20 త‌రువాత కొన్నింటినికి మిన‌హాయింపు ఇవ్వాలా అనేది కేబినేట్ మీటింగ్‌లో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోనున్నారు.

ఈ నెల 19న మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్‌ అమలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌కు ప్ర‌భుత్వం ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటుంది. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ఈ నెల 20 వ‌ర‌కు యాథావిధిగా లాక్‌డౌన్ కొన‌సాగుతుంద‌ని, ఆ త‌ర్వాత ప‌రిస్థితిని బ‌ట్టి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని సీఎం కేసీఆర్ నిన్న జ‌రిగిన ఉన్న‌తస్థాయి స‌మీక్ష‌లో వెల్ల‌డించారు. దీంతో 19న జ‌రిగే మంత్రివ‌ర్గ స‌మావేశంలో ఎటువంటి నిర్ణ‌యం తీసుకోనున్నార‌నే దానిపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. బుధ‌వారం నాటికి తెలంగాణ‌లో క‌రోనా కేసులు సంఖ్య 650కి చేరింది. 118 మంది కోలుకుని ఇంటికి వెళ్ల‌గా.. మ‌రో 128 మంది డిశ్చార్జ్ కానున్న‌ట్లు అధికారులు చెప్పారు.

Next Story
Share it