సామాజిక దూరం పాటించకపోతే లీగల్ యాక్షన్ : సీపీ సజ్జనార్

By రాణి  Published on  14 April 2020 5:22 PM GMT
సామాజిక దూరం పాటించకపోతే లీగల్ యాక్షన్ : సీపీ సజ్జనార్

రాష్ట్రంలో సామాజిక దూరం పాటించడం వల్ల చాలా మంచి ఫలితాలను చూడగలుగుతున్నామని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. ఇకముందు కూడా ప్రజలు ఇలాగే ఉండాల్సిందిగా సజ్జనార్ కోరారు. ఇంకా చాలా ప్రాంతాల్లో ప్రజలు లాక్ డౌన్ నియమాలను సరిగ్గా పాటించడం లేదని, మున్ముందు ఇదే ధోరణి కొనసాగితే వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పాగా వేసిన కరోనా

లాక్ డౌన్ లో రోడ్లపై కనిపిస్తున్నవారిలో చాలా మంది వ్యక్తులు నిత్యావసరాల కోసమని, మెడిసిన్ కోసమని కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తున్నారని తెలిపారు. అలాగే లాక్ డౌన్ లో అన్నార్తులకు అన్నదానం చేసేందుకు కొంతమంది, అత్యవసరంగా ఆస్పత్రులకు వెళ్లాల్సిన వారు కనిపిస్తున్నారన్నారు. మద్యం షాపులు మూసివేసినప్పటికీ కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నట్లు తెలిసిందన్నారు.

హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కరోనా వార్తలు..ప్రముఖ ఛానెల్ పై కేసు

కొన్ని ప్రాంతాల్లో నిత్యావసరాలకోసం వెళ్తున్న ప్రజలు, షాపు యజమానులు సామాజిక దూరం పాటించడం లేదని తమ దృష్టికి వచ్చిందని, ఇకపై ఎక్కడైనా సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే కొన్ని శాఖల సిబ్బంది మాత్రం ప్రజలకు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి కాబట్టి..అలాంటి వారిపై ఎలాంటి చర్యలు లేవన్నారు. కానీ ఖచ్చితమైన కారణం లేకుండా ఊరికే రోడ్లపై తిరిగే వారిపై మాత్రం ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసు నమోదు చేస్తామన్నారు. అలాగే రోడ్లు ఖాళీగానే ఉన్నాయి కదా అని తల్లిదండ్రులు చిన్నపిల్లలతో వాహనాలు నడిపిస్తున్నారని, అది చట్టరీత్యా నేరమన్నారు. 21 రోజుల లాక్ డౌన్ గడువులో 50 మంది మేజర్లు బైక్, కార్లు నడుపుతూ రోడ్డుప్రమాదాలకు గురవ్వగా 14 మంది మృతి చెందినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు.

మీ జన్ ధన్ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదా తెలియట్లేదా ? ఇలా చెక్ చేసుకోండి

Next Story