తెలుగు రాష్ట్రాల్లో పాగా వేసిన కరోనా

By రాణి  Published on  14 April 2020 4:49 PM GMT
తెలుగు రాష్ట్రాల్లో పాగా వేసిన కరోనా

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. మంగళవారం రాత్రి 10 గంటల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 52 కొత్త పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలంగాణ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఒకరు మృతి చెందడంతో మృతుల సంఖ్య 18కి చేరగా మంగళవారం 7 డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 110కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం644 కరోనా కేసులు నమోదవ్వగా ప్రస్తుతం 516 మంది గాంధీ, ఫీవర్, ఇతర ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కరోనా వార్తలు..ప్రముఖ ఛానెల్ పై కేసు

అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 249 మంది కేసులు నమోదవ్వగా..58 మంది కోలుకుని ఇళ్లకు చేరారు. ఆంధ్రాలోనూ రోజు రోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకూ ఆంధ్రాలో 10,505 మందికి కరోనా పరీక్షలు చేయగా 473 మందికి పాజిటివ్ గా తేలింది. కోలుకున్నవారి సంఖ్య మాత్రం పదుల సంఖ్యలోనే ఉంది. ఇప్పటి వరకూ మృతుల సంఖ్య 8కి చేరింది. కర్నూల్ లో అత్యధిక కేసులుండటంతో లాక్ డౌన్ ను మరింత కఠినతరం చేసింది ప్రభుత్వం. డాక్టర్ కరోనా లక్షణాలతో చనిపోవడంతో ఇకపై అత్యవసరమైన మెడికల్, నిత్యావసరాల షాపులను సైతం మూసివేయనున్నట్లు ప్రకటించింది జిల్లా యంత్రాంగం.

చదువుకున్న ఆడపిల్లవి..నువ్విలా చేయడం న్యాయమా ? పోలీస్ ప్రశ్న

Next Story