కోల్‌కతా: వచ్చే నెల నుంచి భారత్ - బంగ్లా మధ్య టెస్ట్ సిరీస్‌లు జరగనున్నాయి. కొల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టెస్ట్ జరగనుంది.ఈ మ్యాచ్‌ను చూడాలని భారత్ - బంగ్లా ప్రధానులకు ఆహ్వానం అందింది. నవంబర్ 22 నుంచి 26 వరకు టెస్ట్ సిరీస్ మ్యాచ్‌ను వీక్షించాల్సిందిగా బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ రెండు దేశాల ప్రధానులకు ఆహ్వానాలు పంపింది. భారత్‌లో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ తోపాటు, రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడటానికి బంగ్లా జట్టు నవంబర్ 3న ఇండియాకు రానుంది.