కొత్త మోటరు వాహన చట్టం జనాల్లో గుబులు రేపుతుంది. ఇప్పుడు మరో పుకారు పుట్టుకొచ్చింది.కొత్త మోటరు వాహన చట్టంపై జనాలు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్న ఓ పుకారు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. బైక్ నడిపే వారికి హెల్మెట్, కారులో ఉన్న వారికి సీటుబెల్ట్ ఎలానో.. క్యాబ్ డైవర్లకు కండోమ్‌లు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. లేదంటే చలానా విధిస్తారంటూ..ఓ వార్త ప్రచారం అవుతుంది. దీనిని పుకారని కూడా అంటున్నారు.

కండోమ్‌ లేని కారణంగా ధర్మేంద్ర అనే క్యాబ్‌ డ్రైవర్‌కు ట్రాఫిక్‌ పోలీసులు చలానా విధించారట..!. ఇందుకు సంబంధించిన రిసిప్ట్‌ను అతడు షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఈ వార్త బాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీని గురించి ధర్మేంద్ర మాట్లాడుతూ.. ‘ట్రాఫిక్‌ సిబ్బంది నా క్యాబ్‌ని చెక్‌ చేసినప్పుడు ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌లో కండోమ్‌ లేదు అని చెప్పి చలానా విధించారు. నాలా ఇంకొకరికి జరగకూడదనే ఉద్దేశంతో.. చలానా కట్టిన రిసిప్ట్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాను’ అని తెలిపాడు.

అయితే.. ఈ విషయమై ట్రాఫిక్‌ పోలీసులను ప్రశ్నించగా కొత్త మోటారు వాహన చట్టంలో ఇలాంటి రూల్‌ ఎక్కడా లేదని.. ట్రాఫిక్ టెస్ట్‌లలో ఎక్కడా కూడా కండోమ్‌ గురించి ఎప్పుడు ప్రశ్నించలేదని తెలిపారు. క్యాబ్‌లో కండోమ్‌ లేదని ఎవరికైనా జరిమానా విధిస్తే.. వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.