పండుగ రోజు బైక్ కొన్నాడు.. షోరూమ్ మొత్తానికి షాక్ ఇచ్చాడు!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Oct 2019 5:33 AM GMT
పండుగ రోజు బైక్ కొన్నాడు.. షోరూమ్ మొత్తానికి షాక్ ఇచ్చాడు!

పండగప్పుడు కొత్త వస్తువులు కొనుక్కోవడం చాలా మందికి అలవాటు. మధ్యప్రదేశ్‌కు చెందిన రాకేష్ కుమార్ కూడా అలాగే కొత్త బండి కొనుక్కుందాం అనుకున్నాడు. హోండా యాక్టివా 125 బైక్ సెలెక్ట్ చేసుకున్నాడు. దాని ఖరీదు 83వేలు. ఇదిగో ఈ డబ్బులు తీసుకోండి అంటూ రాకేష్ ఇచ్చిన డబ్బు చూసి షాక్ అయ్యారు షోరూమ్‌ వాళ్ళు.. ఎందుకంటే రాకేష్ ఇచ్చింది చెక్కో, క్యాషో కాదు. 83 వేల చిల్లర నాణాలు. అయితే ఇందులో ఎక్కువగా ఐదు, పది రూపాయల నాణేలు అవ్వడంతో బతికిపోయారు షోరూమ్ వాళ్ళు. ఎందుకంటే ఆ డబ్బు లెక్కించడానికి వాళ్ళకి మూడు గంటల పైగా పట్టిందట.

Bike1

ఇంటి పెద్ద మొత్తాన్ని రాకేష్ చిల్లర రూపంలో ఎందుకు చెల్లించాడో వివరాలు తెలియదు. కానీ అతని ఫోటోలు, షోరూం సిబ్బంది నాణాలను లెక్కపెడుతున్న ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాకేష్ రూపాయి, 2 రూపాయల కాయిన్లు ఇచ్చి ఉంటే షోరూమ్ వాళ్ళ పరిస్థితి ఏమై ఉండేదో అనుకుంటున్నారు నెటిజన్లు. అంతే కాదు అసలు ఇంత చిల్లర రాకేష్ ఎలా సంపాదించాడో కదా..

Bike 3

Next Story