ఇప్పుడు జూమ్ వంతు.. 30 నిమిషాల్లో 1300 ఉద్యోగాలు ఫ‌ట్‌

Zoom fires around 1300 employees.వీడియో కాన్ఫ‌రెన్సింగ్ సేవ‌లు అందిస్తున్న జూమ్ సంస్థ 30 నిమిషాల్లో 1300 ఉద్యోగాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Feb 2023 4:46 AM GMT
ఇప్పుడు జూమ్ వంతు.. 30 నిమిషాల్లో 1300 ఉద్యోగాలు ఫ‌ట్‌

ఆర్థిక మాంద్యం భ‌యాందోళ‌న‌ల నేప‌థ్యంలో ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలు అన్ని త‌మ ఉద్యోగుల సంఖ్య‌ను త‌గ్గించుకునే ప‌నిలో ఉన్నాయి. ఇప్ప‌టికే మెటా, గూగుల్ వంటి సంస్థ‌లు వ్య‌య నియంత్ర‌ణ కోసం ప‌లువురు ఉద్యోగులను తొలగిస్తున్న‌ట్లు వెల్ల‌డించ‌గా.. తాజాగా వీడియో కాన్ఫ‌రెన్సింగ్ సేవ‌లు అందిస్తున్న జూమ్ సంస్థ కూడా ఈ జాబితాలో చేరింది.

త‌మ కంపెనీలో ప‌ని చేస్తున్న ఉద్యోగుల్లో 15 శాతం అంటే 1300 మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని సీఈఓ ఎరిక్ యువాన్ సంస్థ బ్లాగ్‌లో మంగ‌ళ‌వారం వెల్ల‌డించారు. ఉద్యోగాలు కోల్పోనున్న వారికి 30 నిమిషాల్లో ఈ-మెయిల్ ద్వారా స‌మాచారాన్ని తెలియ‌జేయ‌నున్న‌ట్లు చెప్పాడు.

క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో ఇంటి నుంచి ప‌ని చేసే వారి సంఖ్య ఎక్కువ కావ‌డంతో చాలా మంది జూమ్ సేవ‌ల‌ను వినియోగించేవారు. ఆ స‌మ‌యంలో ఉన్న డిమాండ్‌ను బ‌ట్టి ఎక్కువ మందిని నియ‌మించుకున్నాం. అయితే.. ప్ర‌స్తుతం డిమాండ్ చాలా త‌గ్గింది. దీంతో ఉద్యోగుల‌ను త‌ప్ప‌నిస‌రిగా తొల‌గించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. సంస్థ మ‌నుగ‌డ‌ను దృష్టిలో పెట్టుకోవ‌డంతోనే ఈ క‌ఠిన నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింది. క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తున్న‌, ప్ర‌తిభావంతులైన 1300 మంది ఉద్యోగుల‌కు గుడ్ బై అంటూ భావోద్వేగ పూరిత లేఖ రాశారు ఎరిక్‌.

ఉద్యోగం కోల్పోయిన వారు అమెరికాలో ఉన్న‌ట్లు అయితే వారికి 16 వారాల వేత‌నం, హెల్త్ క‌వ‌రేజీ, యాన్సువ‌ల్ బోన‌స్ అందుతాయ‌ని, అదే ఇత‌ర దేశాల‌కు చెందిన వారు అయితే.. స్థానిక చ‌ట్టాల‌ను బ‌ట్టి ఉద్యోగుల తొల‌గింపు ప్ర‌క్రియ కొన‌సాగుతుంద‌న్నారు. ఇక వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రంలో త‌న జీవితంలో 98 శాతం కోత విధించుకున్న‌ట్లు తెలిపాడు.

Next Story