యూట్యూబ్ సర్వర్ డౌన్..

Youtube down crash error.ప్ర‌ముఖ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాం యూట్యూబ్ సేవ‌ల‌కు మంగ‌ళ‌వారం రాత్రి కొద్ది సేపు సేపు అంత‌రాయం క‌లిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 May 2021 6:03 AM GMT
youtube server down

ప్ర‌ముఖ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాం యూట్యూబ్ సేవ‌ల‌కు మంగ‌ళ‌వారం రాత్రి కొద్ది సేపు అంత‌రాయం క‌లిగింది. చాలా మంది వినియోగ‌దారులు 429లోపం త‌లెత్తిన‌ట్లు సోష‌ల్ మీడియాలో పోస్టులు చేశారు. కొంద‌రికి వీడియో అస్సలు అప్‌లోడ్ కాలేదు. మ‌రికొంద‌రికి ఏమో మీరు ఎంచుకున్న నాణ్య‌మైన వీడియోలు అందుబాటులో లేవు త‌రువాత ప్ర‌య‌త్నించండి అంటూ మేసేజ్‌లు యూ ట్యూబ్‌లో డిస్‌ప్లే అయ్యాయి. కాగా.. ఈ స‌మ‌స్య‌పై యూట్యూబ్ వెంట‌నే స్పందించింది. స‌మ‌స్య‌ను గుర్తించేందుకు య‌త్నిస్తున్న‌ట్లు తెలిపింది. అనంత‌రం స‌మ‌స్య ప‌రిష్క‌రింప‌బ‌డిందని పేర్కొంది.

యూట్యూబ్ సమస్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా మందిని ప్రభావితం చేశాయి. మంగళవారం రాత్రి ఆలస్యంగా.. వేలాది మంది వినియోగదారులు కొద్ది నిమిషాల్లో స‌మ‌స్య‌ను ప్ర‌స్తావిస్తూ సుమారు 2,16,189 పైగా ఫిర్యాదులు అందాయని ఇంట‌ర్నెట్ అంత‌రాయానికి సంబంధించిన వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షించే డౌన్ డైరెక్ట‌ర్‌.కామ్ అనే వెబ్ సైట్ తెలిపింది.


కాగా.. యూట్యూబ్‌లో ఇలా స‌మ‌స్య‌లు త‌లెత్త‌డం ఇదే తొలిసారి ఏమీ కాదు. గ‌తంలో ప్ర‌పంచ వ్యాప్తంగా సుమారు రెండు గంట‌ల పాటు యూట్యూబ్ లో ఎలాంటి వీడియోలు డిస్‌ప్లే కాలేదు.


Next Story