షియోమీ ప్రీమియమ్ ట్యాబ్లెట్ వచ్చేస్తోంది.. ధర ఎంతో తెలుసా..?

Xiaomi may launch Mi Pad 5.భారత్ లో ఇప్పుడు ట్యాబ్ మార్కెట్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వడానికి షియోమీ ప్రణాళికలు రచిస్తూ ఉంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 May 2021 12:25 PM GMT
Xiaomi may launch Mi Pad 5

భారత్ లోని మొబైల్ మార్కెట్ లో షియోమీ సంస్థ దూసుకుపోతూ ఉన్న సంగతి తెలిసిందే..! ఇప్పుడు ట్యాబ్ మార్కెట్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వడానికి షియోమీ ప్రణాళికలు రచిస్తూ ఉంది. కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులందరూ చాలా వరకూ ఇళ్లకే పరిమితమవుతూ ఉన్నారు. ఆన్ లైన్ లో చదువుల విషయమై పిల్లలకు ల్యాప్ టాప్, ట్యాబ్లెట్ పీసీ వంటివి కొనివ్వడానికి తల్లిదండ్రులు ప్రయత్నిస్తూ ఉన్నారు. షియోమీ సంస్థ భారత్ లో విద్యార్థుల అవసరాలను తీర్చడం కోసం ప్రీమియమ్ ట్యాబ్లెట్ పీసీని విడుదల చేయడానికి సిద్ధమైంది. యాపిల్ ఐపాడ్, శాంసంగ్, హువాయే ట్యాబ్లెట్ మార్కెట్ తో పోటీ పడాలని చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ భావిస్తోంది.

ఎంఐ ప్యాడ్ 5, ఎంఐ ప్యాడ్ 5 ప్రో ట్యాబ్లెట్లను జులై లోపు విడుదల చేయాలని భావిస్తోంది. మే నెలలోనే మార్కెట్ లోకి వచ్చే అవకాశాలను షియోమీ సంస్థ ప్రతినిధులు ఖండించారు. ఈ ట్యాబ్లెట్లు జులైలో వస్తాయని అంటూ ఉన్నారు. ఎంఐ ప్యాడ్ సిరీస్ లో భాగంగా రెండు మోడల్స్ ను ప్రస్తుతానికైతే షియోమీ సంస్థ విడుదల చేస్తూ ఉంది. మూడో మోడల్ పూర్తీ హై ఎండ్ మోడల్ అని.. దానిపై త్వరలోనే అప్డేట్ ఇస్తామని చెబుతున్నారు.

ఎంఐ ప్యాడ్ 5.. 2K LCD డిస్ప్లేతో రానుంది.. అలాగే రీఫ్రెష్ రేట్ 120Hz ఉండనుంది. 2560×1600 పిక్సెల్స్ రెజల్యూషన్ తో రానుంది. 4,260mAh బ్యాటరీ కెపాసిటీ తో పాటూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఈ ట్యాబ్ సొంతం. Qualcomm Snapdragon 870 SoC ప్రాసెసర్ తో రానుంది. కేవలం ఈ రెండు మాత్రమే స్నాప్ డ్రాగన్ చిప్ సెట్ తో వస్తాయని.. మిగిలినవి మీడియాటెక్ (MediaTek Dimensity SoC) ప్రాసెసర్లతో రానున్నాయి. ఎంఐ ప్యాడ్ 5 స్క్రీన్ సైజ్ 10.95-ఇంచెస్ గా ఉండనుంది. ఇక టాప్ ఎండ్ ట్యాబ్ రీఫ్రెష్ రేట్ 144Hz ఉండనుంది. ఇప్పటి వరకూ వచ్చిన లీక్ లను బట్టి డ్యూయల్ కెమెరా ఈ ట్యాబ్లెట్ల సొంతమట..20MP ప్రైమరీ సెన్సార్.. 13MP సెకండరీ లెన్స్ ఉండనున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉండనుంది. ఈ ట్యాబ్ ధర 34200 ఉండవచ్చని.. లేదా అంతకంటే తక్కువకే భారత్ లో లభించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.


Next Story