ఇండియాలోనే తొలి బయో లిక్కర్‌ హైదరాబాద్‌లో ప్రారంభం

బయో ఇండియా అధికారికంగా దేశీయంగా ఉత్పిత్తి ఏసిన బయో లిక్కర్‌ ఉత్పత్తులను ప్రారంభించింది.

By Srikanth Gundamalla  Published on  3 April 2024 12:20 PM GMT
bio liquors, launch,  bio india,  hyderabad,

ఇండియాలోనే తొలి బయో లిక్కర్‌ హైదరాబాద్‌లో ప్రారంభం

Hyderabad: బయో ఇండియా అధికారికంగా దేశీయంగా ఉత్పిత్తి చేసిన బయో లిక్కర్‌ ఉత్పత్తులను ప్రారంభించింది. బయో లిక్కర్‌ ఉత్పత్తుల యొక్క ప్రీమియం శ్రేణిని మొదలు పెట్టింది. దీని ద్వారా బయో ఇండియా స్పిరిట్స్‌ పరిశ్రమలో కొత్త శకానికి నాంది పలికింది. ఇండియా సైంటిస్ట్‌ డాక్టర్‌ బి. శ్రీనివాస్‌ అమర్‌నాథ్‌ నేతృత్వంలో బయో లిక్కర్‌ ఆల్కహాల్‌ను రూపొందించే, వినియోగించే విధానంలో ఒక నమూనా మార్పును సూచిస్తాయి. బంజారాహిల్స్‌లోని తాజ్‌ డెక్కన్‌ హోటల్‌లో బయో లిక్కర్ ఉత్పత్తుల ప్రారంభ కార్యక్రమం జరిగింది.

తాము తయారు చేసిన ఉత్పత్తులు సింథటిక్‌ రుచులు, రంగులు లేని సహజ సుగంధాలతో ఉంటాయని ఆవిష్కర్త డాక్టర్‌ శ్రీనివాస్‌ అమర్‌నాథ్‌ తెలిపారు. సాంప్రదాయ ఉత్పత్తులతో పోలిస్తే అదే శాతంలో మత్తు ప్రభావాలను అందిస్తాయని చెప్పారు. రెండు దశాబ్దాల నైపుణ్యం ఆర్‌ అండ్‌ డి నుంచి వీటిని కనుగొన్నట్లు చెప్పారు. బయో బెవరేజెస్‌ ఫ్రాంచైజీ VSS బేవరేజెస్‌ ద్వారా ఈ ఉత్పత్తులను తెలంగాణలో తయారు చేసి విక్రయిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. టుడేస్‌ స్పెషల్‌ బయో విస్కీ, డైలీస్‌ స్పెషల్‌ బయో బ్రాందీతో పాటు వైల్డ్‌ ఫాక్స్‌ విస్కీ బ్రాండ్లు ప్రస్తుతం తెలంగాణలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రపంచంలో వినియోగదారుల ఎంపికను దృష్టిలో ఉంచుకుని మొదటిసారిగా బయో లిక్కర్‌ను అభివృద్ది చేసినట్లు డాక్టర్‌ శ్రీనివాస్‌ అమర్‌నాథ్‌ తెలిపారు. బయో బ్రాండ్స్ ను రూపొందించడానికి అమెరికా సహా వివిధ దేశాలలో ఎన్నో సంవత్సరాలు రిసెర్చ్ చేసినట్లు చెప్పారు. అమెరికా లో ఫెడరల్ గవర్నమెంట్ చే అప్రూవల్ పొంది బయో బెవరేజెస్ ని కనిపెట్టడం లో విజయం సాధించామని డాక్టర్‌ శ్రీనివాస్‌ అమర్‌నాథ్‌ చెప్పారు.

తెలంగాణ ఫ్రాంచైజీ వీఎస్‌ఎస్‌ బెవరేజెస్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ శ్రీ ప్రదీప్‌ మాట్లాడుతూ.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో తెలంగాణ ఒకటి అన్నారు. వినియోగదారుల ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకునే బయో లిక్కర్‌ ఉత్పత్తులను పరిచయం చేస్తున్నామని చెప్పారు. తెలంగాణే తమకు కీలక మార్కెట్‌గా ఉందని చెప్పారు. అందుకే ఇక్కడ ఉత్పత్తులను ప్రారంభించామనీ.. ఇందుకు సంతోషంగా ఉందనీ ప్రదీప్‌ చెప్పారు.

ఇటీవల అమెరికాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో బయో బెవరేజెస్‌ ప్రశంసలు అందుకుందనీ సంస్థ ఎండీ శ్రీనివాస రాయలు అన్నారు. పరిశోధన, అభివృద్ధి, మార్కెటింగ్‌లో గణనీయమైన పెట్టుబడులు పెట్టడం, ప్రపంచ వ్యాప్తంగా పరిశోధన, అభివృద్ధి కోసం వరల్డ్‌ వైడ్‌గా సుమారు 10 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేసినట్లు ఎండీ శ్రీనివాస రాయలు చెప్పారు.

Next Story