యాపిల్ ఫోల్డింగ్ ఫోన్ ను తీసుకుని రాబోతోందా.?

యాపిల్ త్వరలో ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకుని రాబోతోంది. యాపిల్ ఫోల్డబుల్ ఫోన్‌ను తయారు చేయడం గురించి కొంతకాలంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి.

By Medi Samrat  Published on  8 Feb 2024 8:30 PM IST
యాపిల్ ఫోల్డింగ్ ఫోన్ ను తీసుకుని రాబోతోందా.?

యాపిల్ త్వరలో ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకుని రాబోతోంది. యాపిల్ ఫోల్డబుల్ ఫోన్‌ను తయారు చేయడం గురించి కొంతకాలంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. Samsung Galaxy Z Flip , Oppo Find N3 Flip మొబైల్స్ లాగానే ఫోల్డబుల్ ఫోన్‌లరెండు వేర్వేరు వెర్షన్‌లపై యాపిల్ పని చేస్తోందని GSMArena ఇటీవలి నివేదిక పేర్కొంది. ఈ ఫోన్‌లు చిన్నవిగా ఉంటాయి.. సామ్‌సంగ్ లేదా వన్‌ప్లస్ నుండి పెద్ద ఫోల్డబుల్ ఫోన్‌ల మాదిరిగా కాకుండా క్లామ్‌షెల్ లాగా ఫ్లిప్ ఓపెన్ అవుతాయని తెలుస్తోంది.

ఆపిల్ ఈ కొత్త ఫోన్‌లను పరీక్షిస్తున్న మాత్రాన.. అవి త్వరలోనే అమ్మకానికి వస్తాయని అర్థం కాదు. 2025లో కూడా ఈ ఫోల్డబుల్ ఫోన్‌లను భారీగా తయారు చేయడం ప్రారంభించే ఆలోచనలు యాపిల్ సంస్థకు లేవని అంటున్నారు. కనీసం 2026 వరకు ఈ ఫోన్‌ లు మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చే పరిస్థితులు అయితే లేవని తెలుస్తోంది. ఈ కొత్త ఫోన్‌ల విడిభాగాల కోసం Apple కనీసం ఆసియాలోని ఒక కంపెనీతో మాట్లాడుతోంది. యాపిల్ 2018 నుండి ఫోల్డబుల్ ఐఫోన్‌ను తయారు చేయడానికి ప్రయత్నిస్తోంది.

Next Story