మీరూ ఏ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు?.. ఇది తెలుసుకోండి
దేశంలో క్రెడిట్ కార్డుల వాడకం గత రెండేళ్లలో భారీగా పెరిగింది. దీంతో చాలా మందికి వీటి వినియోగం మీద కొంత అవగాహన ఏర్పడింది.
By అంజి Published on 15 April 2024 10:44 AM ISTమీరూ ఏ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు?.. ఇది తెలుసుకోండి
దేశంలో క్రెడిట్ కార్డుల వాడకం గత రెండేళ్లలో భారీగా పెరిగింది. దీంతో చాలా మందికి వీటి వినియోగం మీద కొంత అవగాహన ఏర్పడింది. అయితే కొత్తగా క్రెడిట్ కార్డు కోసం అప్లై చేయాలనుకునేవారు, లేదా ఇప్పటికే వాడుతున్నవారికి ఏ తరహా క్రెడిట్ కార్డు మేలో తెలుసా? అంటే గేట్ వే విధానాలలో వీసా, మాస్టర్, రూపే కార్డులలో ఏది ఉపయోగకరమో తెలుసా? మీ క్రెడిట్ స్కోర్ హెల్తీగా ఉండి.. మంచి ఆఫర్స్ ఉంటే రూపే కార్డు చాలా ఉపయోగకరం. అయితే ఈ రూపే కార్డులు దాదాపు అన్ని బ్యాంకులు అందిస్తున్నాయి.
మీకు బ్యాంకు నుంచి ఫోన్ చేసినా లేదా మీరు అప్లై చేసినా వీసా కార్డ్ తీసుకోమని సలహా ఇస్తుంటారు. దీంతో ఆ బ్యాంక్ టైఅప్ అయి ఉంటే మీకు వాటినే ఇవ్వాలని చూస్తుంటారు. అలాగే మీరు రూపే కార్డు కావాలని చెబితే మీకు శాంక్షన్ అయ్యింది వీసా కార్డ్ అని బదులు ఇస్తుంటారు. అయితే ఆర్బీఐ ఆదేశం అనుసారం కన్జూమర్ ఏ తరహా కార్డు కావాలనుకుంటున్నాడో దాన్ని మాత్రమే ఇవ్వాలి. ఈ రూపే కార్డుతో ఉపయోగం ఏంటంటే.. దీన్ని గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐకి లింక్ చేసుకుని అకౌంట్‌లో డబ్బులు లేకపోయినా దీని ద్వారా నేరుగా పేమెంట్ చేయవచ్చు.
యూపీఐ ద్వారా ఈఎంఐ
రూపే క్రెడిట్ కార్డు వాడుతున్న వారికి కొన్ని కొత్త ఫీచర్లు రాబోతున్నాయి. అందులో ముఖ్యంగా ఈఎంఐ సదుపాయం. అవును యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై రూపే క్రెడిట్ కార్డుల బిల్లును ఈఎంఐల కింద కన్వర్ట్ చేసుకోవచ్చని నేషన్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అలాగే క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్, ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్ ఆప్షన్, లిమిట్ మేనేజ్‌మెంట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. బ్యాంకులు, కార్డు జారీ చేసే సంస్థలు మే 31 కల్లా ఈ ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది.