టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ఎప్పుడు తీసుకోవాలి?

జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవర్వూ చెప్పలేరు. తన మీద ఆధారపడి జీవించేవాళ్ల కోసమే ఈ టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌.

By అంజి
Published on : 23 May 2025 11:45 AM IST

term insurance, Term insurance policy, Life Insurance

టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ఎప్పుడు తీసుకోవాలి?

జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవర్వూ చెప్పలేరు. తన మీద ఆధారపడి జీవించేవాళ్ల కోసమే ఈ టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌. అనుకోని దుర్ఘటనలు ఎదురై కుటుంబ పోషకుడికి ఏదైనా జరిగితే.. జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు, రోడ్డున పడకుండా టర్మ్‌ ఇన్సూరెన్స్‌ వారికి ఆర్థికంగా రక్షణ కల్పిస్తుంది. పాలసీ తీసుకోవడానికి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. వ్యక్తి ఆరోగ్య సమస్యల నుంచి చెడు అవాట్లు, ఉద్యోగ భద్రత వంటి వివిధ అంశాలను నిశితంగా పరిశీలించిన తర్వాతే టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని అందిస్తారు. దీన్ని తీసుకోవడం అందరికీ తేలికకాదు. ఉద్యోఉలు, వ్యాపారులు తీసుకునే డాక్యుమెంట్లు, బ్యాంక్‌ స్టేట్మెంట్లు తదితరాలు వేర్వేరుగా ఉంటాయి. ఈ ఇద్దరి మధ్య టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలోని వ్యత్యాసాలను తెలుసుకుందాం..

చాలా మంది ఉద్యోగం చేస్తూ మంచి అవకాశం రాగానే ఏదో ఒక వ్యాపారంలోకి దిగిపోతారు. ఇలాంటి సందర్భాల్లోనే ఎక్కువ మందికి పాలసీ తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతాయి. ముందుగా ఉద్యోగస్తులు.. సాధారణంగా ఏదైనా పాలసీకి దరఖాస్తు చేసుకున్నప్పుడు కచ్చితంగా మన ఆదాయానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలపాల్సి ఉంటుంది. అలాగే 3 నెలల శాలరీ, బ్యాంక్‌ స్టేట్‌మెంట్స్‌, రెండేళ్ల వరకు ఫైల్‌ చేసిన ఆదాయ పన్ను వివరాలు ఇస్తే సరిపోతుంది.

ఉద్యోగులు పొందినంత తేలిగ్గా వ్యాపారులు పొందలేరు. ఎందుకంటే దీని సరళి వేరుగా ఉంటుంది. ఆదాయం, పెట్టుబడి స్థిరంగా ఉండదు. చార్టెడ్‌ అకౌంటెంట్‌ ఆడిట్‌ చేసిన బ్యాలెన్స్‌ షీట్‌, రెండేళ్లకు సంబంధించిన ఆదాయం, నష్టాన్ని తెలిపే అకౌంట్‌ని చూపించాలి. అలాగే రెండడేళ్ల ఆదాయపు పన్ను వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. కొత్తగా మొదలు పెట్టిన వారికి ఇవ్వన్ని ఉండవు కాబట్టి కష్టం అవుతుంది. దీంతో పాలసీ తీసుకోవడం కష్టతరం అవుతుంది. లేదంటే కనీసం రెండేళ్లు ఆగాల్సి ఉంటుంది. కాబట్టి ఉద్యోగం మానేసే ముందు ఈ విషయం గురించి ఓ సారి ఆలోచించండి.

Next Story