వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌

Whatsapp business Account I తన యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది వాట్సాప్‌. తాజాగా బిజినెస్‌ అకౌంట్లకు

By సుభాష్  Published on  11 Nov 2020 9:15 AM GMT
వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌

తన యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది వాట్సాప్‌. తాజాగా బిజినెస్‌ అకౌంట్లకు షాపింగ్‌ బటన్‌ను జోడిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా కంపెనీలు, వి క్రేతలు అందించే వస్తు, ఇతర సేవల జాబితాను ఒకే క్లిక్‌తో చూసేందుకు కస్టమర్లకు వీలవుతుంది. కొంత కాలంగా వాట్సాప్‌ ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. మంగళవారం నుంచి ఇది ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిందని వాట్సాప్‌ ప్రకటించింది. ప్రతి రోజు ప్రపంచ వ్యాప్తంగా 17.5 కోట్ల మంది యూజర్లు బిజినెస్‌ ఖాతాలకు సందేశాలు పంపిస్తున్నారని వాట్సాప్‌ వెల్లడించింది.

ఇందులో ప్రతి నెల నాలుగు కోట్ల మంది బిజినెస్‌ క్యాటలాక్‌ వీక్షిస్తున్నారని, వీరిలో భారత్‌ నుంచి 30 లక్షల మంది ఉన్నారని సంస్థ తెలిపింది. జాబితాను చూడగలిగితే వస్తువులను కొనుగోలు చేసేందుకు సిద్దమని ఇటీవల భారత్‌లో నిర్వహించిన సర్వేలో 75 శాతం మంది వెల్లడించారని వాట్సాప్‌ తెలిపింది. ఇటువంటి కస్టమర్లు సులభంగా కొనుగోళ్లు జరిపేందుకు వీలుగా కొత్త షాపింగ్‌ బటన్‌ను జోడించినట్లు వెల్లడించింది. అయితే కంపెనీలు, విక్రేతలు తమ వాట్సాప్‌ బిజినెస్‌ ఖాతాలకు క్యాటలాగ్‌ను జోడిస్తేనే సాధారణ వినియోగదార్లు ఈ బటన్‌ను వీక్షించే వీలుంటుందని తెలిపింది.




Next Story