బిగ్ బ్రేకింగ్‌.. దేశ వ్యాప్తంగా వాట్సాప్ సేవ‌ల‌కు అంత‌రాయం

WhatApp down as users facing problems in sending, receiving messages.మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవ‌ల‌కు అంత‌రాయం

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 25 Oct 2022 1:31 PM IST

బిగ్ బ్రేకింగ్‌.. దేశ వ్యాప్తంగా వాట్సాప్ సేవ‌ల‌కు అంత‌రాయం

ప్ర‌ముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవ‌లు నిలిచిపోయాయి. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల నుంచి సేవ‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. దేశ వ్యాప్తంగా సేవ‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డ‌డంతో యూజ‌ర్లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గ్రూపుల్లో మెసేజ్‌లు వెళ్ల‌డం లేద‌ని, వ్య‌క్తిగ‌తంగా మెసెజ్‌లు పంపిస్తే బ్లూటిక్ రావ‌డం రాలేద‌ని ప‌లువురు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫిర్యాదులు చేస్తున్నారు.


మ‌రోవైపు దీనిపై వాట్సాప్ మాతృసంస్థ మెటా స్పందించింది. సేవ‌ల‌ను పున‌రుద్ద‌రించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని ఆ సంస్థ ప్ర‌తినిధి తెలిపారు. కేవ‌లం భార‌త్‌లోనే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాల్లో వాట్సాప్ సేవ‌లు నిలిచిపోయిన‌ట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. వాట్సాప్ ప‌ని చేయ‌డం లేద‌ని తెలియ‌డంతో అప్పుడే నెటీజ‌న్లు ఫ‌న్నీ మీమ్స్ సైతం రూపొందిస్తున్నారు.



Next Story