ఇంట్రాడే ట్రేడింగ్‌ చేయాలా? వద్దా?

అతి తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు పొందేందుకు చాలా మంది ఇంట్రాడే ట్రేడింగ్‌ చేస్తుంటారు. స్టాక్‌ని ఒక రోజులో కొనుగోలు చేసి, తిరిగి అదే రోజు అమ్మడాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు.

By అంజి  Published on  9 Sep 2024 5:37 AM GMT
Intraday trading, trading stocks, Trading, Stock Market, Stock Market Psychology

ఇంట్రాడే ట్రేడింగ్‌ చేయాలా? వద్దా?

అతి తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు పొందేందుకు చాలా మంది ఇంట్రాడే ట్రేడింగ్‌ చేస్తుంటారు. స్టాక్‌ని ఒక రోజులో కొనుగోలు చేసి, తిరిగి అదే రోజు అమ్మడాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. ఇందులో షేర్లను హోల్డ్‌ చేయలేరు. కొన్నరోజే అమ్మేయాలి. అయితే దీనిలో ఉన్న ఆప్షన్‌ ఏంటంటే.. పడిపోతాయనుకున్న షేర్లను ముందుగానే అమ్మేసి వాటి ధర తగ్గగానే కొనొచ్చు. కాకపోతే షేర్‌ ధర పెరుగుతుందా? తగ్గుతుందా? అనేది మాత్రం ముందుగానే అంచనా వేయగలగాలి. ట్రేడింగ్‌ వల్ల లాభమా? నష్టమా? అసలు ట్రేడింగ్‌ చేసేవారికి అవగాహన ఉండాలా? వద్దా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మార్కెట్‌ సైకాలజీ తెలిసుండాలి

ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఓ వెసులుబాటు ఉంటుంది. అదే లెవరేజ్‌. అంటే.. మన పెట్టుబడికి బ్రోకరేజ్‌ సంస్థలు మరికొంత డబ్బును యాడ్‌ చేస్తాయి. సెబీ నిబంధనల ప్రకారం.. ఒక స్టాక్‌ మీద గరిష్టంగా 5 రెట్ల లెవరేజ్‌ను ఇస్తాయి. ఉదా.రూ.1000 లో ట్రేడ్‌ అవుతున్న 100 స్టాక్స్‌ను కొనుగోలు చేయాలంటే.. సాధారణంగా లక్ష రూపాయలు కావాలి. కానీ ఇంట్రాడేలో రూ.20 వేలు ఉంటే సరిపోతుంది. ట్రేడింగ్‌ చేయడానికి స్టాక్‌ మార్కెట్‌ సైకాలజీని నేర్చుకోవాలి. అలాగే మార్కెట్‌ గురించి తెలిసి ఉండాలి. ఒడిదొడుకులను సరిగ్గా అంచనా వేయాలి. ట్రేడింగ్‌ స్ట్రాటజీలను నేర్చుకోవాలి. ఇది చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.

అవగాహనకు పేపర్‌ వర్క్‌:

డైరెక్ట్‌గా ట్రేడింగ్‌లో దిగితే నష్టపోతారు. అందుకే అవగాహన కోసం కొన్ని రోజులు పేపర్‌ వర్క్‌ చేయాలి. డబ్బులు పెట్టకుండా మీ ఐడియాలను పేపర్‌పై రాసుకొని రిజల్ట్‌ను చెక్‌ చేసుకోవాలి. మీ ఐడియా వర్కవుట్‌ అవుతుందా? లేదా? గమనిస్తుంటే.. ట్రేడింగ్‌లో మీ సామర్థ్యం ఎంతో మీకే తెలుస్తుంది.

నష్టాలే ఎక్కువ:

2018 - 19 ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే 2022 - 23లో ట్రేడింగ్‌ చేసేవారి సంఖ్య 3 రెట్లు పెరిగింది. ఇందులో 48 శాతం మంది.. 30 ఏళ్లలోపు వారే ఉన్నారు. అయితే ఇలా ట్రేడ్‌ చేసే వారిలో కేవలం 30 శాతం మాత్రమే లాభం పొందుతున్నారని సెబీ నివేదిక తెలిపింది. ఇక రోజుకు 10 మంది ట్రేడ్‌ చేస్తుంటే.. అందులో 8 మంది నష్టపోతున్నారు. ఇంట్రాడే ట్రేడింగ్‌లో కళ్లు చెదిరేంత లాభాలు ఉన్నట్టే.. నష్టాలు కూడా ఉంటాయని మర్చిపోకూడదు. ఇది చాలా అవగాహనతో కూడుకున్నది.

Next Story