మిడ్ క్యాప్స్ అంటే మధ్య స్థాయి మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు. ఇవి ఇన్వెస్టర్లకు అధిక వృద్ధి సామర్థ్యాన్ని అందిస్తాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం.. టాప్ 101 నుంచి 250 గల కంపెనీలను మిడ్ క్యాప్స్ అంటారు. ఇవి వర్ధమాన ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా పని చేస్తాయి. ఇవే భవిష్యత్తులో లార్జ్ క్యాప్‌గా ఎదిగే అవకాశం ఉంటుంది.
వీటికి గణనీయమైన లాభాలను ఆర్జించే సామర్థ్యం కూడా ఉంటుంది. కాకపోతే, లార్జ్ క్యాప్ కంపెనీల కంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలికంగా వీటికి అపారమైన సామర్థ్యం ఉన్నప్పటికీ.. స్వల్ప, మధ్య కాలికంగా అంచనాలను అందుకోలేకపోవచ్చు. మిడ్ క్యాప్ కంపెనీలలో పెట్టుబడి పెట్టడానికి సులభమైన మార్గం మిడ్‌క్యాప్ ఫండ్స్.
మిడ్ క్యాప్స్‌లో మీ పెట్టుబడిని పలు యాప్స్ ద్వారా పెట్టవచ్చు. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేకపోతే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా పొదుపు చేయవచ్చు. ఇలా ఎక్కువ కాలాం పెట్టుబడి పెట్టడం ద్వారా రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. మిడ్‌క్యాప్ ఫండ్స్ 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువకాలం పెట్టుబడి పెట్టగల సామర్థ్యం ఉన్న ఇన్వెస్టర్లకు అనుకూలంగా ఉంటాయి.